WhatsApp: వాట్సాప్‌లో నయా ఫీచర్, ఆ వినియోగదారులకు మాత్రమే!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.
వాట్సాప్.. ప్రస్తుతం అత్యంత ప్రజాధారణ కలిగిన మెసేజింగ్ యాప్. వాట్సాప్ అంటే సరదా, కాలక్షేపం మాత్రమే కాదు. దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బిజినెస్ ప్రమోషన్ కోసం, కస్టమర్లతో సంప్రదింపుల కోసం, మార్కెటింగ్ ప్రమోషన్స్ కోసం, ట్యూషన్స్ కోసం, వైద్య సేవల కోసం, ఫుడ్ ఆర్డర్స్ కోసం, ఒకటేమిటీ వాట్సాప్ ద్వారా ఎన్నో పనులు చేసుకోవచ్చు. బహుళ ప్రయోజనాలున్న ఈ యాప్ ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్ డేట్ అవుతుంది. వినియోగదారులకు మరింత యూజర్ ఫ్రెండ్లీగా తయారవుతుంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఫీచర్లను రూపొందిస్తూ ఆకట్టుకుంటోంది.
కెమెరా షార్ట్‌కట్ ఫీచర్
ఈ నేపథ్యంలో వాట్సాప్ నుంచి తాజాగా మరో ఫీచర్ వినియోగదారుల ముందుకు రాబోతుంది. WhatsApp కొన్ని Android బీటా వెర్షన్లకు కెమెరా షార్ట్ కట్ ను విడుదల చేస్తోంది. కమ్యూనిటీని క్రియేట్ చేసే వారికి కోసం ఈ ఫీచర్లను ప్రారంభించబోతున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. WhatsApp వినియోగదారుల ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కొన్ని కొన్ని ఎగ్జైటింగ్ అప్ డేట్స్ పై పని చేస్తోంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కొంత మంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు కొత్త కెమెరా షార్ట్‌కట్‌ను విడుదల చేస్తోంది. ఇది కెమెరా ట్యాబ్‌కు ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఫీచర్ ఎనేబుల్ చేయబడినప్పుడు కెమెరా ట్యాబ్ ఆటోమేటిక్ గా కమ్యూనిటీల ట్యాబ్‌తో రీప్లేస్ అవుతుంది. ఈ మేరకు WABetaInfo ఫీచర్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.
బీటా వినియోగదారులకు మాత్రమే
ఇన్ స్టంట్ మెసేజ్ యాప్.. కెమెరా షార్ట్ కట్ పక్కనే సెర్చ్ బటన్ ను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, వినియోగదారులు కెమెరా ట్యాబ్ ను అంతగా పట్టించుకోరు. వాస్తవానికి, ఈ ఫీచర్ పొరపాటున ప్రారంభించబడి ఉండవచ్చు. ఎందుకంటే ఇది కమ్యూనిటీలను సృష్టించే సామర్థ్యం ఉన్న వినియోగదారుల కోసమే ప్రారంభించాలి. త్వరలో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు వెబ్ బీటా ఇన్ ఫో వెల్లడించింది. ఈ లేటెస్ట్ ఫీచర్ కొంతమంది బీటా వినియోగదారులకు మాత్రమే ప్రారంభించబడింది. రాబోయే కొన్ని వారాల్లో మరింత మంది వినియోగదారులకు అప్ డేట్ అందించనుంది.
మరో ఫీచర్ పైనా టెస్టింగ్
అటు లింక్ చేయబడిన పరికరాలలో వినియోగదారులు తమ స్వంత చాట్‌ను ఉపయోగించుకునేలా వాట్సాప్ పరిశోధన జరుపుతుంది. ఇంతకు ముందు, వాట్సాప్ వినియోగదారులు ఇంపార్టెంట్ నోట్స్ సేవ్ చేయడానికి వారి సొంత ఫోన్ నంబర్ తో చాట్‌ను తెరవడం ద్వారా తమకు తామే మెసేజ్ లు సందేశాలు పంపుకునేవారు. అయితే, మల్టీ డివైజెస్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు. ముఖ్యంగా.. వినియోగదారుల స్వంత ఫోన్ నంబర్‌లతో చాట్ ప్రైమరీ డివైజ్ లోనే చూపించబడుతుంది. మల్టీ డివైజెస్ వినియోగిస్తున్నప్పుడు కూడా అందుబాటులో ఉండేలా ఫీచర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?