Tecno Pova 2 India Launch: 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో నుంచి కొత్త ఫోన్ రానుంది. టెక్నో పోవా 2 పేరున్న ఈ ఫోన్ ఆగస్టు 5న మనదేశంలో లాంచ్ కానుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానున్న ఈ ఫోన్ ధర రూ.11 వేల లోపే ఉండనుంది.
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి మరో బిగ్ బ్యాటరీ కెపాసిటీ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నోకు చెందిన పోవా 2 (Tecno Pova 2) సార్ట్ ఫోన్ మన దేశంలో ఆగస్టు 5న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. మీడియాటెక్ హీలియో జీ85 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో ఇది పనిచేయనుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్. ఈ ఫోన్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అవ్వగా.. తాజాగా ఇండియా మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను అమెజాన్ టీజర్ రూపంలో విడుదల చేసింది. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి కంపెనీ సీఈవో అరిజీత్ తలపాత్రా సైతం ఇటీవల ట్వీట్ చేశారు.
Incredible power, endless possibilities for the young India! To enable the consumer with power that sustains their need of always staying connected, soon launching a new TECNO smartphone packed with an incredibly powerful 7000mAh battery.#TECNO #StopAtNothing #incrediblepower pic.twitter.com/U46Z7n6T6p
— arijeet talapatra (@ArijeetT) July 12, 2021
టెక్నో వేరియంట్లు, ధర..
టెక్నో పోవా 2 ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్ కింద రూ.500 తగ్గింపును అందించనున్నారు. ఇది డాజిల్ బ్లాక్, ఎనర్జీ బ్లూ, పోలార్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ల సేల్ ఆగస్టు 5 నుంచి అమెజాన్‌లో ప్రారంభం కానుంది.
Also Read: ఇన్‌ఫీనిక్స్ నుంచి స్మార్ట్ 5ఏ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
టెక్నో పోవా 2 స్పెసిఫికేషన్ల వివరాలు..
- టెక్నో పోవా 2లో 6.9 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ (1080) డిస్‌ప్లే ఉంటుంది.
- 2 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ 85 ప్రాసెసర్‌తో ఇది పనిచేయనుంది
- గేమ్ స్పేస్ 2.0, గేమ్ వాయిస్ చేంజర్, సిస్టం టర్బో 2.0 ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
- బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.
- దీని స్టాండ్‌బై సమయం 46 రోజుల వరకు ఉంటుంది. అలాగే 31 గంటల వీడియో ప్లేబ్యాక్, 233 గంటల మ్యూజిక్ ప్లే టైమ్, 49 గంటల కాలింగ్ టైమ్, 20 గంటల వెబ్ బ్రౌజింగ్ సమయాన్ని ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
- 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో స్టో అందుబాటులోకి వచ్చింది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఇది పనిచేస్తుంది.
- ఇందులో వెనక వైపు నాలుగు కెమెరాలను అందించారు. మెయిన్ కెమెరా (Primary Camera) సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
- కనెక్టివిటీ ఆప్షన్లుగా వైఫై, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్లు ఉన్నాయి.
- ప్రొక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సెలరో మీటర్, కంపాస్/ మాగ్నెటో మీటర్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: బిగ్ బ్యాటరీ కెపాసిటీ ఫోన్లు ఇవే.. వీడియో గేమర్స్‌కు వీటితో పండగే