Infinix Smart 5A: ఇన్‌ఫీనిక్స్ నుంచి స్మార్ట్ 5ఏ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ పేరున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 2న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు కేరాఫ్ అయిన ఇన్‌ఫీనిక్స్ బ్రాండ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ (Infinix Smart 5A) పేరున్న ఈ ఫోన్ ఆగస్టు 2వ తేదీన (రేపు) మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను ఫ్లిప్ కార్ట్ టీజర్ రూపంలో రివీల్ చేసింది. ఈ టీజర్‌లో ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ డిజైన్, స్పెసిఫికేషన్ల వివరాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌ఫీనిక్స్ నుంచి విడుదలైన స్మార్ట్ 5కు తర్వాతి వెర్షన్‌గా ఇది విడుదల కానుంది. ఈ ఫోన్ ఓషన్ వేవ్, మిడ్ నైట్ బ్లాక్, క్వెట్జల్ సియాన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ అన్‌లాక్ అందించారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ..
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ ఫోనులో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లే ఉండనుంది. అలాగే 6.52 అంగుళాల అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. దీని స్టాండ్‌బై సమయం 35 రోజుల వరకు ఉంటుంది. అలాగే 19 గంటల హెచ్‌డీ వీడియో ప్లేబ్యాక్, 28 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 13 గంటల గేమింగ్, 33 గంటల 4 జీ టాక్ టైమ్, 16 గంటల వెబ్ బ్రౌజింగ్ సమయాన్ని అందించింది.
డిస్‌ప్లే 500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా ఉంటుంది. 13 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరా కాన్ఫిగరేషన్ ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు మైక్రో యూఎస్‌బీ పోర్టు ఉండనుంది. వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఫోన్ కుడి వైపున ఉన్నాయి. ఫోన్ పైభాగంలో ఎడమ వైపున సిమ్ ట్రే ఉండనుంది. స్పీకర్ గ్రిల్లే, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఛార్జింగ్ ఫోర్టు ఫోన్ కింది వైపు అంచుల్లో ఉంటాయి. ఇది 183 గ్రాముల బరువు, 8.7 ఎంఎం మందం కలిగి ఉంటుంది.
జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లతో..
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ ఫోన్ రిలయన్స్ జియో ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లతో రానుంది. జియో ఆఫర్ ద్వారా రూ.550 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ప్రధాన సిమ్ కార్డు స్లాట్‌లో జియో సిమ్ ఉపయోగిస్తేనే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు తెలుస్తోంది. అయితే జియోను ప్రధాన సిమ్‌గా కనీసం 30 నెలల పాటు ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం.. ఇది మీడియాటెక్ హీలియో జీ 25 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉండనుంది. ధర రూ.7000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
మరింత చదవండి: ఇన్‌ఫీనిక్స్ నుంచి కొత్త ఫోన్.. రూ.8 వేల లోపు ధర!