Samsung Galaxy F23 5G Launch: రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను రూ.15 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy F23 5G: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన గెలాక్సీ ఎఫ్22కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ, ఐకూ జెడ్3, రియల్‌మీ 9 ప్రో 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,499గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499గా ఉంది. ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మార్చి 16వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది.
ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే... రూ.1,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతోపాటు రెండు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద 4 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.15,999కు, 6 జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు. అంటే హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ఆఫర్ కూడా అప్లై చేస్తే... రూ.14,999కే ఈ ఫోన్ కొనేయచ్చన్న మాట.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-యూ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఇందులో అందించారు.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో డాల్బీ అీట్మాస్ సపోర్ కూడా అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!