Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!
గూగుల్ తన ప్లేపాస్ సబ్‌స్క్రిప్షన్ సర్వీసులను మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.99 నుంచి ప్రారంభం కానుంది.
![Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే! Google Launched Play Pass With Rs 99 Monthly Subscription Know Details Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/02/2e4450b5dc0f6a327486fe7c8ede7734_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Google Play Pass Subscription: గూగుల్ మనదేశంలో కొత్త ప్లే పాస్‌ను లాంచ్ చేసింది. ఈ సబ్‌స్క్రిప్షన్ పాస్ ద్వారా యాప్స్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. గేమ్స్‌ను ఫ్రీగా ఆడవచ్చు. మొత్తంగా 41 కేటగిరిల్లోని 1000కి పైగా యాప్స్‌ను ఈ ప్లే పాస్ ద్వారా యాడ్స్ లేకుండా ఉపయోగించుకోవచ్చు.
గూగుల్ ప్లే పాస్ సబ్ స్క్రిప్షన్ ధర
గూగుల్ దీనిపై ఒక నెల ట్రయల్ పీరియడ్‌ను అందిస్తుంది. అనంతరం నెలకు రూ.99 లేదా సంవత్సరానికి రూ.889 చెల్లించి దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. గూగుల్ ఫ్యామిలీ గ్రూపు ద్వారా ఐదుగురు ఫ్యామిలీ మెంబర్ల వరకు ఈ సబ్‌స్క్రిప్షన్ ఉపయోగించుకోవచ్చు.
సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఎలా?
గూగుల్ ప్లే పాస్ ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉంది. గత వారం నుంచి దీని రోల్ అవుట్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్ ప్రొఫైల్‌లో ‘ప్లే పాస్’పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ట్రయల్‌ను స్టార్ట్ చేయవచ్చు.
ప్లేస్టోర్‌లో ప్లే పాస్ ట్యాబ్‌లో ఉన్న యాప్స్, గేమ్స్‌ను లేదా ప్లేస్టోర్‌లో బ్రౌజ్ చేస్తూ ప్లే పాస్ ‘టికెట్’ ద్వారా సబ్‌స్క్రైబర్లు ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో యూజర్ బేస్ పెంచుకోవడానికి కొత్త రెవిన్యూ స్ట్రీమ్‌ను అన్‌లాక్ చేయడానికి భారతీయ డెవలపర్లకు ప్లే పాస్ సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
ప్లేపాస్‌లో కొత్త గేమ్స్‌ను, యాప్స్‌ను యాడ్ చేయడానికి స్థానిక, గ్లోబల్ డెవలపర్లకు గూగుల్ అవకాశం ఇస్తుంది. ప్లేపాస్ కలెక్షన్‌లో గేమ్స్, స్పోర్ట్స్, పజిల్స్, యాక్షన్ గేమ్స్... ఇలా ఎంతో కలెక్షన్ అందుబాటులో ఉండనుంది. జంగిల్ అడ్వెంచర్స్, వరల్డ్ క్రికెట్ బ్యాటిల్ 2, మాన్యుమెంట్ వాలే, అట్టర్, యూనిట్ కన్వర్టర్, ఆడియో ల్యాబ్ వంటి యాప్స్ కూడా యాడ్స్ లేకుండా బ్రౌజ్ చేయవచ్చు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)