అన్వేషించండి

Realme C35: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

రియల్‌మీ కొత్త ఫోన్ సీ35 థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా తెలపలేదు.

Realme New Phone: రియల్‌మీ సీ35 స్మార్ట్ ఫోన్ థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. యూనిసోక్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి. గతంలో లాంచ్ అయిన రియల్‌మీ సీ25 స్మార్ట్‌ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.

రియల్‌మీ సీ35 ధర
ఇందులో రెండు వేరియంట్లను కంపెనీ లాంచ్ చేసింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,799 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా (సుమారు రూ.13,350) నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,299 యువాన్లుగా (సుమారు రూ.14,500) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ వాటర్ డ్రాప్ నాచ్‌ను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.7 శాతంగా ఉండనుంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు మాక్రో కెమెరా, బ్లాక్ అండ్ వైట్ పొర్‌ట్రెయిట్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. జీపీఎస్/ఏ-జీపీఎస్, యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా.. బరువు 189 గ్రాములుగా ఉంది.

View this post on Instagram
 
A post shared by realme Thailand (@realme_thailand)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget