Redmi Price Hike: ఈ బడ్జెట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా.. బ్యాడ్ న్యూస్.. రేట్లు పెరిగాయి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచింది. రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9ఏ స్మార్ట్ ఫోన్ల ధర భారీగా పెరిగింది.
రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలను షియోమీ పెంచింది. ఇప్పుడు ఈ రెండు కొత్త ఫోన్ల ధరలను కంపెనీ కాస్త పెంచింది. ఈ రెండు ఫోన్లూ రూ.8 వేలలోపు ధరలోనే మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటి ధరను కంపెనీ రూ.300 మేర పెంచింది.
రెడ్‌మీ 9ఏ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.6,999గా ఉండగా, ఇప్పుడు రూ.7,299కు పెంచారు. ఇక 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999 నుంచి రూ.8,299కు పెంచారు.
రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999 నుంచి రూ.7,299కు పెంచారు. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999 నుంచి రూ.8,299కు పెరిగింది. ఈ రెండు ఫోన్లూ పెరిగిన ధరలతోనే అమెజాన్, షియోమీ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
‘డిమాండ్, సప్లై చైన్‌లో తలెత్తిన సమస్యల కారణంగా స్మార్ట్ ఫోన్ల తయారీలో ఉపయోగించే పరికరాల ధర భారీగా పెరిగింది. మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా.. ధర పెంపు అనివార్యం అయింది. మరిన్ని మోడల్స్ ధరలు కూడా పెరగనున్నాయి. షియోమీ ఇండియాలో ధరలను నిజాయితీగా నిర్ణయించడం పైనే మా దృష్టి ఉంటుంది. మరిన్ని వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంపై మేం మరింత దృష్టి పెడతాం’ అని షియోమీ అధికార ప్రతినిధి తెలిపారు.
రెడ్‌మీ 9ఏ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించలేదు. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరాల విషయానికి వస్తే.. రెడ్‌మీ 9ఏలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కూడా ఉంది.
రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ స్పెసిఫికేషన్లు
దీని స్పెసిఫికేషన్లు కూడా రెడ్‌మీ 9ఏ తరహాలోనే ఉన్నాయి. కాకపోతే ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎంట్రీ లెవల్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్లలో ధరకు తగ్గ ఫీచర్లనే కంపెనీ అందించింది. ఇంట్లో పెద్ద వాళ్లకు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఇవి కరెక్ట్ ఆప్షన్లు. వీటి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే ఉండనుంది.
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!