News
News
X

Oppo 5G Phone: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఏ55ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. దీని ధర రూ.22 వేలలోపే ఉంది.

FOLLOW US: 

ఒప్పో ఏ55ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. 6.5 అంగుళాల డిస్‌ప్లే, హోల్ పంచ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

ఒప్పో ఏ55ఎస్ ధర
దీని ధరను 32,800 యెన్‌లుగా(సుమారు రూ.21,200) నిర్ణయించారు. కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. గ్రీన్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ జపాన్‌లో నవంబర్ 26వ తేదీ నుంచి జరగనుంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

ఒప్పో ఏ55ఎస్ 5జీ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ఎల్టీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఇందులో ఒప్పో అందించింది.

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటిక్ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 178 గ్రాములుగా ఉంది.

Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Nov 2021 08:24 AM (IST) Tags: Oppo Oppo A55s 5G Oppo A55s 5G Price Oppo A55s 5G Specifications Oppo A55s 5G Features Oppo 5G Phone

సంబంధిత కథనాలు

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

టాప్ స్టోరీస్

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

Kcr Reservation Politics : రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

Kcr Reservation Politics :    రిజర్వేషన్ల అంశానికి కేసీఆర్ ఎలాంటి ముగింపు తీసుకు రాబోతున్నారు ? గిరిజన కోటా  జీవో ఎందుకు ఆలస్యం అవుతోంది ?

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

YSRCP News: టీడీపీ బంగాళాఖాతంలోకి, ఆగని పేరు మార్పు రచ్చ! వరుస ట్వీట్లతో కౌంటర్ ఇస్తున్న వైసీపీ నేతలు

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?

Chiranjeevi - Godfather Climax Fight : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?