By: ABP Desam | Updated at : 22 Nov 2021 06:52 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో వేరే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. ఈ డివైస్ చైనాలో లాంచ్ అయి ఇప్పటికే నెలపైనే అవుతుంది. వన్‌ప్లస్ 9ఆర్‌టీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో వన్‌ప్లస్ ఆర్‌టీగా లాంచ్ కానుందని తెలుస్తోంది.
గూగుల్ సపోర్టెడ్ డివైసెస్ లిస్ట్, గూగుల్ ప్లే లిస్టింగ్ వెబ్‌సైట్‌లో కూడా వన్‌ప్లస్ 9ఆర్‌టీ కనిపించింది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. అయితే చైనాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 9ఆర్‌టీ పేరుతో ఈ డివైస్ కనిపించలేదు. వన్‌ప్లస్ ఆర్‌టీ పేరుతో ఈ డివైస్ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
‘ఇదే మోడల్ బిల్డ్‌తో గతంలో బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్ పొందిందని’ ముకుల్ పేర్కొన్నారు. ఈ డివైస్ మనదేశంలో నవంబర్‌లోనే లాంచ్ కావాల్సిందని, అయితే త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో మాత్రం తెలియరాలేదు. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.40 వేల రేంజ్‌లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 9ఆర్‌టీలో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 1300 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
4500 ఎంఏహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీని ఇందులో అందించారు. 65టీ వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఒప్పో కలర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 9ఆర్‌టీ పనిచేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 సెల్ఫీ కెమెరాను వన్‌ప్లస్ ఇందులో అందించింది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో వన్‌ప్లస్ అందించడం విశేషం.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!
Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!
Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!
Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్
Vijayashanthi: దొంగను పట్టించండి - ఈటల రాజేందర్‌కు విజయశాంతి కౌంటర్
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్