News
News
X

Moto G22: మోటో జీ22 వచ్చేసింది - రూ.12 వేలలోపే - అదిరిపోయే ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన జీ22 స్మార్ట్ ఫోన్‌ను యూరోప్‌లో లాంచ్ చేసింది.

FOLLOW US: 

Moto G22 Launched: మోటొరోలా (Motorola) తన జీ22 స్మార్ట్ ఫోన్‌ను యూరోప్‌లో లాంచ్ చేసింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్‌విజన్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

మోటో జీ22 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 169.99 యూరోలుగా (సుమారు రూ.14,270) నిర్ణయించారు. ఈ ఫోన్ త్వరలో ఇండియా, ఆసియా, లాటిన్ అమెరికాల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. కాస్మిక్ బ్లాక్, ఐస్ బెర్గ్ బ్లూ, పెరల్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో రూ.12 వేలలోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మోటో జీ22 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్‌విజన్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 185 గ్రాములుగా ఉంది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

Published at : 06 Mar 2022 07:15 PM (IST) Tags: Moto G22 Launch Moto G22 Specifications Moto G22 Price Moto G22 Moto G22 Features Moto G22 Launched

సంబంధిత కథనాలు

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

Phone in Rain: మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిచిపోయిందా? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, ఇలా చేయండి

Phone in Rain: మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిచిపోయిందా? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, ఇలా చేయండి

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Border Love Story :  ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Mohan babu :  షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు -  ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?