![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Motorola 194MP Camera Phone: 194 మెగాపిక్సెల్‌తో మోటొరోలా ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా - లాంచ్ ఎప్పుడంటే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ మోటొరోలా ఫ్రంటియర్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇందులో 194 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం.
![Motorola 194MP Camera Phone: 194 మెగాపిక్సెల్‌తో మోటొరోలా ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా - లాంచ్ ఎప్పుడంటే! Motorola Frontier With 194MP Camera Rumoured To Be in Works May Launch in July 2022 Motorola 194MP Camera Phone: 194 మెగాపిక్సెల్‌తో మోటొరోలా ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా - లాంచ్ ఎప్పుడంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/19/f101687d46253edb913c47e37046d07d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మోటొరొలా ఫ్రంటియర్ స్మార్ట్ ఫోన్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి ఈ ఫోన్‌లో 194 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. గతంలో ఇందులో 200 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు 194 మెగాపిక్సెల్ కెమెరా అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గానూ... 125W ఫాస్ట్ చార్జింగ్ కూడా ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ జులైలో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉంది.
ఈ ఫోన్ రెండర్లను ప్రముఖ టిప్‌స్టర్ ఎవాన్ బ్లాస్ షేర్ చేశారు. ఇందులో ఈ ఫోన్‌ను అన్నివైపులా చూడవచ్చు. ఇందులో కర్వ్‌డ్ డిస్‌ప్లే, కర్వ్‌డ్ బ్యాక్ చూడవచ్చు. పంచ్ హోల్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఫోన్‌కు కుడివైపు ఉన్నాయి. వెనకవైపు అడ్డంగా గీతలను అందించారు.
మోటొరోలా ఫ్రంటియర్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ 144 హెర్ట్జ్ కాగా... హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1కు తర్వాతి వెర్షన్ అయిన ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
ఇందులో 194 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ కూడా ఉండనున్నట్లు సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 125W వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై 6ఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్ వీ5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)