Vivo V25 Series: వివో వీ25 సిరీస్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మనదేశంలో వివో వీ25 సిరీస్‌ను జులైలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
వివో వీ25 సిరీస్ ఫోన్లు జులై నెలలో మనదేశంలో లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో వివో వీ25 ప్రో 5జీ కూడా ఉండనుంది. చైనాలో గతంలో లాంచ్ అయిన వివో ఎస్15 ప్రో మొబైల్‌నే మనదేశంలో వివో వీ25 ప్రోగా రీబ్రాండ్ చేస్తున్నట్లు సమాచారం.
గతంలో వివో ఎస్12 ప్రోని రీబ్రాండ్ చేసి మనదేశంలో వివో వీ23 ప్రోగా లాంచ్ చేశారు. దీన్ని బట్టి ప్రస్తుతం వివో వీ25 ప్రో కూడా ఎస్15 ప్రోగా రానుందని అంచనా వేయవచ్చు. ఇంతవరకు వివో వీ25 ప్రో లాంచ్‌కు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.
వివో ఎస్15 ప్రో ఫీచర్లు
ఇందులో 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ యాస్పెక్ట్ రేషియో 19.8:9గా ఉండగా... స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. దీంతోపాటు హైరిజల్యూషన్ ఆడియోను కూడా వివో ఎస్15 ప్రో సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీని ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పొర్‌ట్రెయిట్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉండనుంది. దీంతోపాటు 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram