News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vivo T1x 5G: వివో కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ టీ1ఎక్స్‌ను త్వరలో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

వివో టీ1ఎక్స్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ వివో ఫోన్ చైనాలో గతేడాది లాంచ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ట్వీట్ చేశాడు.

వివో టీ1ఎక్స్ ధర (అంచనా)
చైనాలో ఈ ఫోన్ ధర 1,699 యువాన్ల (సుమారు రూ.20,000) నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా దీని ధర అదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఎంత ఉండనుందో మాత్రం లాంచ్ అయ్యే దాకా తెలియరాలేదు.

వివో టీ1ఎక్స్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ1ఎక్స్ పనిచేయనుంది. ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్క భాగంలో అందించారు. 

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by DroidAfrica (@droid_africa)

Published at : 29 Jun 2022 10:04 PM (IST) Tags: Vivo New Phone Vivo T1x 5G India Launch Vivo T1x 5G Vivo T1x 5G Features Vivo T1x 5G Specifications

ఇవి కూడా చూడండి

Poco M6 Pro 5G: 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్న 5జీ ఫోన్ రూ.15 వేలలోపే - సూపర్ ఫోన్ దించిన పోకో!

Poco M6 Pro 5G: 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్న 5జీ ఫోన్ రూ.15 వేలలోపే - సూపర్ ఫోన్ దించిన పోకో!

Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!

Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!

New SIM Card Rules: కొత్త సిమ్ కావాలా? డిసెంబర్ 1 నుంచి నయా రూల్స్ రాబోతున్నాయ్!

New SIM Card Rules: కొత్త సిమ్ కావాలా? డిసెంబర్ 1 నుంచి నయా రూల్స్ రాబోతున్నాయ్!

Instagram photo edit: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Instagram photo edit: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

5G Phones Under Rs 20k: రూ.20 వేలలోపు టాప్ 5జీ ఫోన్లు ఇవే - న్యూ ఇయర్ ఆఫర్లలో రేట్ ఇంకా తగ్గచ్చేమో!

5G Phones Under Rs 20k: రూ.20 వేలలోపు టాప్ 5జీ ఫోన్లు ఇవే - న్యూ ఇయర్ ఆఫర్లలో రేట్ ఇంకా తగ్గచ్చేమో!

టాప్ స్టోరీస్

LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!