Tecno Spark 9: టెక్నో సూపర్ బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - రూ.10 వేలలోపు బెస్ట్ ఫీచర్లతో!
చైనా బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనుంది. దీని ధర రూ.10 వేలలోపే ఉండనుంది.
టెక్నో స్పార్క్ 9 స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 18వ తేదీన లాంచ్ కానుంది. రూ.10 వేలలోపు ధరలో 11 జీబీ వరకు ర్యామ్ అందించే మొదటి ఫోన్ ఇదే కానుందని కంపెనీ తెలిపింది. ఇందులో 6 జీబీ వరకు ఫిజికల్ ర్యామ్, 5 జీబీ వరకు ఎక్స్‌టెండబుల్ వర్చువల్ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్ కూడా ఉండనుంది. రెడ్‌మీ 9 యాక్టివ్, రియల్‌మీ నార్జో 50ఐ, ఒప్పో ఏ15ఎస్ స్మార్ట్ ఫోన్లతో ఇది పోటీ పడనుంది.
టెక్నో స్పార్క్ 9 ధర
ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 18వ తేదీన లాంచ్ కానుందని కంపెనీ ట్వీట్ ద్వారా ప్రకటించింది. దీని ధర రూ.10 వేలలోపే ఉండనుంది. దీనికి సంబంధించిన మైక్రో సైట్‌లో ఈ ఫోన్ ఇన్‌ఫినిటీ బ్లాక్, స్కై మిర్రర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుందని పేర్కొన్నారు.
టెక్నో స్పార్క్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 11 జీబీ ర్యామ్ (6 జీబీ ర్యామ్ + 5 జీబీ వర్చువల్ ర్యామ్), 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీని కెమెరా ఫీచర్లను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే డిజైన్ చూస్తే ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను అందించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించనున్నారు. సెల్ఫీ కెమెరాను ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్‌లో అమర్చనున్నారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram