Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ 2.

FOLLOW US: 

రియల్‌మీ జీటీ 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. రియల్‌మీ జీటీ 2 ప్రోను ఇటీవలే మనదేశంలో కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు రియల్‌మీ జీటీ 2 కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, వెనకవైపు మూడు కెమెరాలు, పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

రియల్‌మీ జీటీ 2 ధర
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ప్రారంభ వేరియంట్లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందించారు. దీని ధర రూ.34,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999గా నిర్ణయించారు. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ ఏప్రిల్ 28వ తేదీన జరగనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపు లభించనుంది.

రియల్‌మీ జీటీ 2 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ 2 పనిచేయనుంది. 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కల్పిస్తుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 65W సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. కేవలం 33 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు వైడ్ యాంగిల్, మాక్రో షూటర్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా... బరువు 199.8 గ్రాములుగా ఉంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

Published at : 22 Apr 2022 08:03 PM (IST) Tags: Realme New phone Realme GT 2 Realme GT 2 Specifications Realme GT 2 Features Realme GT 2 Price in India Realme GT 2 Launched

సంబంధిత కథనాలు

Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!

Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!

Redmi Note 11T: రెడ్‌మీ నోట్ 11టీ సిరీస్ వచ్చేస్తుంది - బడ్జెట్ ధరలోనే సూపర్ 5జీ ఫోన్లు!

Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?

Vivo Y75: వివో కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు