By: ABP Desam | Updated at : 09 Mar 2022 02:13 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐప్యాడ్ ఎయిర్ 2022 మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: Apple)
iPad Air (2022): ఐప్యాడ్ ఎయిర్ (2022)ని యాపిల్ లాంచ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ (2022)తో పాటు ఇది కూడా లాంచ్ అయింది. ఇందులో యాపిల్ ఎం1 చిప్‌ను అందించారు. ఇందులో ముందువైపు అప్‌గ్రేడ్ చేసిన కెమెరాను అందించారు. 2020లో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ తరహాలోనే దీని డిజైన్ ఉంది.
ఐప్యాడ్ ఎయిర్ (2022) ధర
ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. వైఫై ఓన్లీ మోడల్‌లో 64 జీబీ వేరియంట్ ధరను రూ.54,900గా నిర్ణయించారు. ఇక వైఫై + సెల్యులార్ మోడల్‌లో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.68,900గా నిర్ణయించారు. ఈ రెండు మోడల్స్‌లోనూ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందించారు. మార్చి 18వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది.
ఐప్యాడ్ ఎయిర్ (2022) స్పెసిఫికేషన్లు
ఐప్యాడ్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10.9 ఎల్ఈడీ బ్యాక్‌లిట్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. 2020లో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్‌లో కూడా ఇదే డిస్‌ప్లేను అందించారు. టచ్ ఐడీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. పవర్/స్టాండ్‌బై బటన్‌లో ఈ టచ్ ఐడీ అందించారు. ఇందులో ఎం1 చిప్‌ను అందించారు.
గతంలో లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ కంటే 60 శాతం వేగంగా దీని సీపీయూ పెర్ఫార్మెన్స్ ఉండనుంది. గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఏకంగా రెండు రెట్లు వేగంగా ఉండనుంది. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక ముందువైపు కూడా 12 మెగాపిక్సెల్ కెమెరానే అందించారు.
64 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్కెచ్‌లు వేసుకోవడానికి ఇందులో యాపిల్ పెన్సిల్ (రెండో తరం) సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Upcoming Mobiles in December 2023: కొత్త ఫోన్‌తో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? - డిసెంబర్లో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్లు ఇవే!
New SIM Card Rules: కొత్త సిమ్ కావాలా? డిసెంబర్ 1 నుంచి నయా రూల్స్ రాబోతున్నాయ్!
Airtel Vs Jio: నెట్‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే ఎయిర్టెల్, జియో ప్లాన్లు ఇవే - మినిమం రీఛార్జ్ ఎంతంటే?
Instagram photo edit: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
5G Phones Under Rs 20k: రూ.20 వేలలోపు టాప్ 5జీ ఫోన్లు ఇవే - న్యూ ఇయర్ ఆఫర్లలో రేట్ ఇంకా తగ్గచ్చేమో!
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనా
/body>