News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

iPhone SE 2022: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఐఫోన్ ఎస్ఈ (2022). దీని ధర రూ.43,900 నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

iPhone SE (2022): యాపిల్ (Apple) తన కొత్త ఐఫోన్ ఎస్ఈని ఎట్టకేలకు లాంచ్ చేసింది. అదే ఐఫోన్ ఎస్ఈ (2022). 2020 ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ (2020)కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో 5జీ కనెక్టివిటీని అందించారు. ఏ15 బయోనిక్ చిప్‌పై (A15 Bionic SoC) ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే దీని డిజైన్ ఉంది.

ఐఫోన్ ఎస్ఈ (2022) ధర
ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.43,900గా నిర్ణయించారు. ఇది 64 జీబీ వేరియంట్ ధర. ఇందులో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు కూడా ఉండనున్నాయి. వీటి ధరను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అమెరికాలో ఈ ఫోన్ ధరను 429 డాలర్లుగా (సుమారు రూ.33,000) నిర్ణయించారు. మిడ్‌నైట్, స్టార్‌లైట్, (ప్రొడక్ట్) రెడ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు మనదేశంలో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.

ఐఫోన్ ఎస్ఈ (2022) స్పెసిఫికేషన్లు
ఐఓఎస్ 15 (iOS 15) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే చూడటానికి గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే ఉంది. అయితే ఫోన్ ముందువైపు, వెనకవైపు అత్యంత కఠినమైన గ్లాస్‌ను అందించినట్లు యాపిల్ అంటోంది. ఐపోన్ 13, ఐఫోన్ 13 ప్రోల్లో అందించిన గ్లాస్ ప్రొటెక్షన్‌ను యాపిల్ ఇందులో కూడా అందించింది.

ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ చిప్ ద్వారా ఐఫోన్ 8 కంటే 1.8 రెట్లు వేగంగా ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ తరహాలోనే ఇందులో కూడా వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అయితే ఇందులో మెరుగైన విజువల్ ప్రాసెసింగ్‌ను అందించినట్లు కంపెనీ తెలిపింది. వెనకవైపు కెమెరా డీప్ ఫ్యూజన్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇది 4కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 60 ఎఫ్‌పీఎస్, స్మార్ట్ హెచ్‌డీఆర్4 వద్ద 4కే వీడియోను రికార్డ్ చేయవచ్చు. 

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు ఫేస్‌టైం హెచ్‌డీ కెమెరాను అందించారు. 5జీ, 4జీ వోల్టే, వైఫై 5, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, లైటెనింగ్ పోర్టు ఇందులో ఉండనున్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో ఉండనున్నాయి.

ఇందులో టచ్ ఐడీని అందించారు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా చార్జింగ్ వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది కీ స్టాండర్డ్ బేస్డ్ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉందని కంపెనీ తెలిపింది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

Published at : 09 Mar 2022 01:04 AM (IST) Tags: iPhone SE 2022 Price in India iPhone SE 2022 iPhone SE 2022 Specifications iPhone SE 2022 Features iPhone SE 2022 India Launch

ఇవి కూడా చూడండి

Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !

Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !

టాప్ స్టోరీస్

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!

Highest Selling Hatchback Cars: నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్‌బాక్‌లు ఇవే - కొనసాగుతున్న మారుతి సుజుకి హవా!