అన్వేషించండి

Realme C35 6GB RAM: 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.14 వేలలోపే - రియల్‌మీ చవకైన ఫోన్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన సీ35 స్మార్ట్ ఫోన్‌లో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. ఇందులో 6 జీబీ ర్యామ్ అందించారు.

రియల్‌మీ సీ35 (Realme C35) స్మార్ట్ ఫోన్‌లో కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ వేరియంట్‌లో 6 జీబీ ర్యామ్ అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లలో అందించే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్ కూడా ఉన్నాయి. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

రియల్‌మీ సీ35 ధర
ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది.

రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను అందించారు. 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇటీవలే లాంచ్ అయిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ జీటీ నియో 2లో అందించిన 50 మెగాపిక్సెల్ కెమెరానే ఇందులో కూడా అందించారు. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget