Realme C33: రూ.10 వేలలోపే రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ - 128 జీబీ వరకు స్టోరేజ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన సి-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది.
రియల్‌మీ త్వరలో మనదేశంలో సీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ సీ33. దీని స్టోరేజ్ ఆప్షన్లు, కలర్ వేరియంట్లు, ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. రియల్‌మీ సీ-సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మీ సీ30, సీ31, సీ35 ఫోన్లు లాంచ్ అయ్యాయి.
రియల్‌మీ లాంచ్ చేయనున్న ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ సీ33నే. శాండీ గోల్డ్, ఆక్వా బ్లూ, నైట్ సీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. భారతీయ మార్కెట్లో సీ-సిరీస్ ఫోన్లకు మంచి రెస్పాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ కానుంది. రూ.10 వేల నుంచే దీని ధర ప్రారంభం కానుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
దీంతోపాటు కంపెనీ ఇటీవలే రియల్‌మీ 9ఐ 5జీని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. ఈ సంవత్సరం జనవరిలో మనదేశంలో లాంచ్ అయిన రియల్‌మీ 9ఐ 4జీ వెర్షన్‌కు 5జీ మోడల్‌గా ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లను కూడా కంపెనీ మైక్రోసైట్ ద్వారా రివీల్ చేసింది. ఈ ఫోన్ ధర బడ్జెట్‌లోనే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ 9ఐ 5జీ లాంచ్ ఈవెంట్ ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు వర్చువల్‌గా జరగనుంది.రియల్‌మీ సోషల్ మీడియా చానెళ్లలో ఈ కార్యక్రమాన్ని లైవ్ చూడవచ్చు. యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల్లో కూడా ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. రియల్‌మీ 9ఐ 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై పని చేయనుంది.
దీని బ్యాటరీ గురించి కంపెనీ రివీల్ చేసింది. ఇందులో భారీ బ్యాటరీ ఉండనుందని కంపెనీ తెలిపింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉండనుంది. వీటికి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ బట్టి దీని అంచులు ఫ్లాట్‌గా ఉండనుందని చెప్పవచ్చు. పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపున ఉంది.
రియల్‌మీ ఇటీవలే చవకైన ట్యాబ్లెట్‌ను కూడా మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ ప్యాడ్ ఎక్స్. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ పనిచేయనుంది. రియల్‌మీ లాంచ్ చేసిన మొదటి 5జీ ట్యాబ్లెట్ ఇదే. దీని వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది.
దీని ధరమనదేశంలో రూ.19,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. వైఫై కనెక్టివిటీని ఈ మోడల్ సపోర్ట్ చేయనుంది. ఇక 5జీ ఫీచర్ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.25,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో 5జీ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.27,999గా ఉంది. గ్లేసియర్ బ్లూ, గ్లోయింగ్ గ్రే రంగుల్లో ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!