Oppo Reno 7 Lite 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో రెనో 7 లైట్ 5జీ.
ఒప్పో రెనో 7 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ యూరోప్‌లో లాంచ్ అయింది. ఒప్పో రెనో 7 సిరీస్‌లో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. థాయ్‌ల్యాండ్‌లో గత నెలలో లాంచ్ అయిన ఒప్పో రెనో 7జెడ్ 5జీ తరహాలో దీని ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అమోఎల్ఈడీ డిస్‌ప్లే, వెనకవైపు మూడు కెమెరాలు, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌లను ఈ ఫోన్‌లో ఒప్పో అందించింది.
ఒప్పో రెనో 7 లైట్ 5జీ ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. సెంట్రల్, తూర్పు యూరోప్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. కాస్మిక్ బ్లాక్, రెయిన్‌బో స్పెక్ట్రం రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు. 350 యూరోల (సుమారు రూ.29,100) రేంజ్‌లో దీని ధర ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
ఒప్పో రెనో 7 లైట్ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఈ ఫోన్ ద్వారా పొందవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఒప్పో రెనో 7 లైట్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.74 సెంటీమీటర్లు కాగా... బరువు 173 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?