By: ABP Desam | Updated at : 08 May 2022 09:43 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందించారు
వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్ అందించారు. ఈ ఫోన్‌ను అమెజాన్ సమ్మర్ సేల్‌లో అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
వన్‌ప్లస్ 9 ఆఫర్
ఈ ఫోన్ అసలు ధర రూ.49,999 కాగా... రూ.35,999కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు తగ్గింపు లభించనుంది. అంటే ఈ ఫోన్‌పై రూ.15,000 తగ్గింపు లభించనుందన్న మాట. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.15 వేలు తగ్గింపుతో రూ.39,999కే లభించనుంది.
వన్ ప్లస్ 9 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 9 పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో వన్ ప్లస్ అందించింది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్689 సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రీఫాం లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. వార్ప్ చార్జ్ 65టీ ఫాస్ట్ చార్జింగ్‌ను వన్‌ప్లస్ 9 సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఇందులో ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఉన్న స్పీకర్లు ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.81 సెంటీమీటర్లుగానూ, బరువు 183 గ్రాములుగానూ ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
Realme C30: రూ.10 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?
Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ
Airtel Network Issue: ఎయిర్టెల్ వినియోగదారులకు నెట్వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!