Jio Phone 5G: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ త్వరలోనే - ఇండియన్ స్టాండర్డ్స్ లిస్టింగ్‌లో కూడా!
జియో ఫోన్ 5జీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్ సైట్లో కనిపించింది. కాబట్టి త్వరలో లాంచ్ కావచ్చు.
జియో ఫోన్ 5జీ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్ సైట్లో కనిపించింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుందని అంచనా వేయవచ్చు. 2022 జులైలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది వాయిదాలు పడుతూనే ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుందని వార్తలు వస్తున్నాయి. 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయని తెలుస్తోంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాను అందిస్తున్నారు. LS1654QB5 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ బీఐఎస్ డేటాబేస్‌లో కనిపించింది. బీఐఎస్ లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్లను ఎక్కువగా ఉంచరు. ఇది మనదేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ కానుందని సమాచారం.
జియోఫోన్ 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన పని చేయనుందని తెలుస్తోంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
జియో ఈ ఫోన్ కోసం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మనదేశంలో LYF బ్రాండింగ్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర మనదేశంలో రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్యలో ఉండనుందని గతంలో లీకులు వచ్చాయి.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram