అన్వేషించండి

iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

యాపిల్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లను కంపెనీ లాంచ్ చేసింది. మ‌న‌దేశంలో వీటి ధ‌ర రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో సిరీస్ ను యాపిల్ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 13 సిరీస్ కంటే మెరుగైన బ్యాట‌రీ లైఫ్, మంచి కెమెరాలతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 14, 14 ప్లస్‌ల్లో ఏ15 బయోనిక్ చిప్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఏ16 బయోనిక్ చిప్‌ను అందించారు.

ఐఫోన్ 14 ధ‌ర
ఐఫోన్ 14 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది. మిగతా వేరియంట్ల ధర ఇంకా తెలియరాలేదు. దీని సేల్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 తరహాలోనే దీని ధర కూడా ఉంది. మరీ ఎక్కువగా పెట్టకుండా యాపిల్ జాగ్రత్త పడింది.

ఐఫోన్ 14 ప్లస్ ధ‌ర‌
దీని ప్రారంభ వేరియంట్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. ఇందులో కూడా మిగతా వేరియంట్ల ధర తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన సేల్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 14 ప్రో ధ‌ర‌
ఇక ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర మనదేశంలో రూ.1,29,990గా ఉంది. వీటికి సంబంధించిన సేల్ కూడా సెప్లెంబర్ 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి.

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధ‌ర‌
దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.1,39,990గా ఉంది. 128 జీబీ నుంచి 1 టీబీ వరకు వేర్వేరు వేరియంట్లు ఇందులో ఉండనున్నాయి. దీని సేల్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 14 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది. గత సంవత్సరం మోడల్లో అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. ఫేస్ ఐడీ టెక్నాలజీ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

దీని బ్యాటరీ, ర్యామ్ వివరాలను యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే థర్డ్ పార్టీ టియర్ డౌన్ వీడియోల ద్వారా కొన్ని వారాల్లోనే దీని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. మెరుగైన స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉంది. దీన్ని యాక్షన్ మోడ్ అంటారు. లో లైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ ఫోన్ మెరుగ్గా చేయనుంది.

ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి. ఇందులో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 14 కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. కెమెరాలు మాత్రం ఐఫోన్ 14 తరహాలోనే ఉన్నాయి.

ఐఫోన్ 14 ప్రో స్పెసిఫికేషన్లు
ఇక ప్రో మోడల్స్ విషయానికి వస్తే... వీటిలో సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌ను అందించారు. ఐఫోన్ 14 ప్రోలో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఫోన్ ముందువైపు పిల్ ఆకారంలో ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను యాపిల్ అందించింది. దీనికి డైనమిక్ ఐల్యాండ్ అని పేరు పెట్టారు. యాపిల్ ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన కెమెరా అందించారు.

ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
దీని ఫీచర్లు కూడా దాదాపుగా ఐఫోన్ 14 ప్రో తరహాలోనే ఉన్నాయి. ఇందులో పెద్ద డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే సైజు 6.7 అంగుళాలుగా ఉంది. ప్రో మోషన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget