Messenger Calling Features: మెసెంజర్ యాప్‌లో కొత్త ఫీచర్ - ఇక కాల్స్ చేయాలంటే?
మెసెంజర్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను మెటా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో, వీడియో కాల్స్‌కు ప్రత్యేకమైన ఫంక్షన్ బార్‌ను యాప్‌లో అందించనున్నారు.
మెటా తన మెసెంజర్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో, వీడియో కాల్స్‌కు ప్రత్యేకమైన ఫంక్షన్ బార్‌ను ఇందులో అందించారు. చాట్స్, స్టోరీస్, పీపుల్ ట్యాబ్ పక్కనే ఈ కొత్త ట్యాబ్ కూడా కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయగానే మీ మెసెంజర్‌లోని కాంటాక్ట్స్ అక్కడ కనిపిస్తాయి. పక్కనే ఆడియో, వీడియో కాల్స్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి.
ఈ ఫీచర్ అందుబాటులోకి రావడానికి ముందు వినియోగదారులు ఎవరికైనా కాల్ చేయాలంటే చాటింగ్‌లోకి వెళ్లాల్సి ఉండేది. ఈ కొత్త ఫీచర్ ద్వారా నేరుగా ఫ్రెండ్స్‌కు కాల్ చేసే అవకాశం ఉంటుంది. మెసెంజర్ కాలింగ్ ఫీచర్ గురించి ఎక్కువ అవగాహన లేనివారికి ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
2020 ప్రారంభం నుంచి మెసెంజర్‌లో ఆడియో, వీడియో కాలింగ్ 40 శాతం పెరిగింది. మెసెంజర్‌లో కూడా ఎన్నో చాట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మెసేజ్ రియాక్షన్లు, స్టిక్కర్లు, మెసేజ్ స్పెసిఫిక్ రిప్లైలు, ఫార్వాడింగ్ వంటి ఫీచర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో కూడా 2023 నాటికి డిఫాల్ట్‌గా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందించాలని మెటా ప్రణాళికలు రచిస్తుంది. మెసెంజర్ వీడియో కాల్స్‌కు కూడా ఏఆర్ ఎఫెక్ట్స్‌ను మెటా యాడ్ చేసింది. దీని ద్వారా వినియోగదారులు ఫిల్టర్లు, మాస్క్‌లు, యానిమేషన్లతో వీడియో కాల్స్ సమయంలో ప్రయోగాలు చేయవచ్చు.
మెసేజింగ్ యాప్స్ విషయంలో ఈ మెసెంజర్ యాప్‌కు చాలా పోటీ ఉంది. గూగుల్ వాయిస్, వైబర్, సిగ్నల్, వాట్సాప్, టెలిగ్రాంల నుంచి మెటాకు తీవ్రపోటీ ఎదురవుతోంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram