Jio Monthly Prepaid Plans: జియో అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే - మూడూ నెల రోజుల వ్యాలిడిటీనే!
Jio Cheapest Prepaid Plans: రిలయన్స్ జియో దగ్గర మూడు నెలవారీ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు లభించనున్నాయి.
Jio Recharge Plans: ఈ ఏడాది జూలై నెలలో భారతదేశంలోని మూడు ప్రధాన టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. ఈ మూడు కంపెనీలే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా. ఈ మూడు కంపెనీలు తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను చాలా భారీగా పెంచాయి.
రీఛార్జ్ ప్లాన్ల ధర పెరిగిన తర్వాత ఈ కంపెనీల చవకైన ప్లాన్ల ధర ఎంత అనేది చాలా మంది వినియోగదారులకు ఇప్పటికీ తెలియదు. జియో మూడు చవకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి రేట్ల పెంపు తర్వాత ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మూడు ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఈ మూడూ అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తాయి.
1. రూ.189 ప్లాన్ (Jio Rs 189 Plan)
ఈ ప్లాన్ ఇంతకు ముందు ధర రూ.155, కానీ ఇప్పుడు దీని ధర రూ.189 అయింది. ఈ ప్లాన్ ద్వారా అందే లాభాలు ఇవే...
డేటా: 2 జీబీ డేటా
వాయిస్ కాలింగ్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
ఎస్ఎంఎస్: అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్
వ్యాలిడిటీ: 28 రోజులు
తక్కువ డేటా అవసరం అయితే అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ పొందాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
2. రూ.249 ప్లాన్ (Jio Rs 249 Plan)
ఈ ప్లాన్ ఇంతకు ముందు ధర రూ.209, కానీ ఇప్పుడు దీని ధర రూ.249గా మారింది. ఈ ప్లాన్ ద్వారా అందే లాభాలు ఇవే...
డేటా: రోజుకు 1 జీబీ
వాయిస్ కాలింగ్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
ఎస్ఎంఎస్: అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్
వ్యాలిడిటీ: 28 రోజులు
ప్రతిరోజూ 1 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ పొందాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
3. రూ.299 ప్లాన్ (Jio Rs 299 Plan)
ఈ ప్లాన్ ధర గతంలో రూ.239గా ఉంది. కానీ ఇప్పుడు దీని ధర రూ.299కి పెరిగింది. ఈ ప్లాన్ ద్వారా అందే లాభాలు ఇవే...
డేటా: రోజుకు 1.5 జీబీ
వాయిస్ కాలింగ్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
ఎస్ఎంఎస్: అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్
వ్యాలిడిటీ: 28 రోజులు
రోజువారీ డేటా 1.5 జీబీ వరకు అవసరం అంటే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
ఈ మూడు ప్రస్తుతం జియో అందిస్తున్న మూడు చవకైన రీఛార్జ్ ప్లాన్‌లు. ఇవి 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఫోన్‌కు 28 రోజుల వ్యాలిడిటీతో చవకైన జియో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు రూ. 189 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం ముఖ్యం. దీని కంటే తక్కువ ధరలో జియో నెలవారీ ప్లాన్ ఏదీ లేదు. అయితే ఈ ప్లాన్‌లతో మీరు జియో సినిమా, జియో యాప్‌ల వంటి జియో అందించే కొన్ని ఇతర సేవల ప్రయోజనాలను కూడా పొందుతారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?