అన్వేషించండి

ధర తక్కువ, రేంజ్‌ ఎక్కువ! మారుతి ఇ విటారా లేదా హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ - ఏది బెస్ట్ డీల్?

మారుతి ఇ విటారా ఆల్ఫా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ LR టాప్ వేరియంట్ల పోలిక - బ్యాటరీ, రేంజ్, ఫీచర్లు, ధరలలో ఏది ఎక్కువ విలువ ఇస్తుందో తెలుసుకోండి.

EV Range Comparison India: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ SUVల పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, మారుతి తన మొదటి ఎలక్ట్రిక్‌ SUV అయిన ఇ విటారాను ఇటీవలే అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరోవైపు, హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌ కూడా అదే సెగ్మెంట్‌లో బలమైన పోటీ ఇస్తోంది. ఇప్పుడు ఈ రెండు కార్ల టాప్ వేరియంట్లు - e విటారా ఆల్ఫా, క్రెటా ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ LR - మధ్య పూర్తి పోలికలు, తేడాలు తెలుసుకుందాం.

డైమెన్షన్స్‌ - ఏ కారు పెద్దది?

e విటారాకు క్రెటా ఎలక్ట్రిక్ కంటే 90 మిల్లీమీటర్లు ఎక్కువ వీల్‌బేస్ ఉంది. కొంచెం వెడల్పు కూడా ఎక్కువే. అయితే క్రెటా ఎలక్ట్రిక్ మొత్తం పొడవులో 65 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 15 మిల్లీమీటర్లు ఎక్కువ.

బూట్ స్పేస్ విషయంలో క్రెటా ఎలక్ట్రిక్ 127 లీటర్లు అదనంగా ఇస్తుంది. అంతేకాదు, ముందుభాగంలో ఫ్రంక్ స్టోరేజ్ కూడా అందిస్తోంది. e విటారాలో ఈ ఫీచర్ లేదు.

బ్యాటరీ & రేంజ్ - ఏ కారు ఎక్కువ దూరం వెళ్తుంది?

 
మారుతి ఇ విటారా
హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌
బ్యాటరీ సైజ్‌(kWh)
 
61
51.4
మోటార్ సెటప్
 
ముందు భాగంలో సింగిల్‌ మోటార్‌
ముందు భాగంలో సింగిల్‌ మోటార్‌
పవర్ (hp)
 
174
171
టార్క్ (Nm)
 
193
255
ARAI రేంజ్‌ (km)
 
543
510

e విటారా ఆల్ఫా వేరియంట్‌లో 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నారు. క్రెటా ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ LRలో 51.4 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. రెండింటిలోనూ సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది.

పవర్ పరంగా e విటారా స్వల్పంగా 3 హెచ్‌పీ ఎక్కువ ఇస్తుంది. కానీ టార్క్ విషయంలో క్రెటా ఎలక్ట్రిక్ 62 ఎన్ఎమ్ ఎక్కువ ఇస్తుంది.

రేంజ్ విషయానికి వస్తే, ఒక్కసారి పూర్తి చార్జ్‌తో e విటారా క్రెటా కంటే సుమారు 33 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణిస్తుంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో రోజువారీ వినియోగానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

చార్జింగ్ స్పీడ్ - ఏ కారుది ఎక్కువ వేగం?

క్రెటా ఎలక్ట్రిక్ 11 కిలోవాట్ AC చార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. e విటారా గరిష్టంగా 7.4 కిలోవాట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

DC ఫాస్ట్ చార్జింగ్‌లో క్రెటా 100 కిలోవాట్ వరకు సపోర్ట్ చేస్తే, e విటారా 70 కిలోవాట్ వరకు మాత్రమే.

10 నుంచి 100 శాతం AC చార్జింగ్‌కు e విటారా 9 గంటలు పడుతుంది. క్రెటా ఎలక్ట్రిక్‌కు 4.5 గంటలే సరిపోతాయి. DC ఫాస్ట్ చార్జింగ్‌లో కూడా క్రెటా కొంచెం వేగంగా ఉంటుంది.

ఎక్స్‌టీరియర్ & ఇంటీరియర్ ఫీచర్లు

రెండింటిలోనూ LED లైటింగ్ సెటప్ ఉంది. అయితే e విటారా 18 అంగుళాల పెద్ద అలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ అందిస్తుంది.

ఇంటీరియర్‌లో e విటారా లెదరెట్ డాష్‌బోర్డ్, అదనపు స్పీకర్లు, మరిన్ని USB పోర్టులు ఇస్తుంది.

క్రెటా ఎలక్ట్రిక్‌లో మాత్రం ప్యానోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ AC, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రెండో వరుసకు వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్‌తో బాస్ మోడ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ & డ్రైవింగ్ టెక్నాలజీ

రెండింటిలోనూ మూడు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. అయితే e విటారా ప్రత్యేకంగా స్నో మోడ్ అందిస్తుంది.

సేఫ్టీ పరంగా e విటారా అదనపు ఎయిర్‌బ్యాగ్ ఇస్తుంది. అలాగే BNCAPలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. క్రెటా ఎలక్ట్రిక్‌లో ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ ఉంది.

ధర - ఏ కారుకు విలువ ఎక్కువ?

e విటారా ఆల్ఫా ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 19.79 లక్షలు.
క్రెటా ఎలక్ట్రిక్ ఎక్సలెన్స్ LR ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 23.66 లక్షలు.

దాదాపు రూ. 3.87 లక్షలు తక్కువ ధరలో e విటారా ఎక్కువ బ్యాటరీ, ఎక్కువ రేంజ్ అందిస్తోంది. క్రెటా ఎలక్ట్రిక్ వేగవంతమైన చార్జింగ్, కొన్ని అదనపు కంఫర్ట్ ఫీచర్లు ఇస్తున్నా, ధర పోలికలో చూస్తే e విటారానే ఎక్కువ విలువ ఇస్తుందని చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget