Kolkata Earthquake: కోల్‌కతాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5 గా నమోదు.. బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు
పశ్చిమ బెంగాల్ లో, బంగ్లాదేశ్‌లో పలుచోట్ల భూమి కంపించింది. కోల్‌కతాలో అయితే రిక్టర్ స్కేలుపై తీవ్రత 5 కాగా, బంగ్లాదేశ్ లో 5.5 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కిందపడటం, కిటికీలు ఊగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. భూమి కంపించిన ప్రాంతాల్లో ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
బంగ్లాదేశ్‌లో భూకంప కేంద్రం
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం, ఈ భూకంప కేంద్రం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్ లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ అంతర్భాగంలో సుమారు 10 నుండి 20 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించడం వల్ల దీని ప్రభావం బంగ్లాదేశ్‌తో పాటు సరిహద్దు ప్రాంతం అయిన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలపై పడింది.
🔎 What was the faulting motion that caused the #earthquake (#भूकंप) in #Sātkhira? Moment tensor map from seismological institute(s): pic.twitter.com/URhLZ8B1a6
— EMSC (@LastQuake) February 27, 2026
డార్జిలింగ్‌లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చారు. బెంగాల్‌లోనూ కోల్‌కతా సహా పలుచోట్ల భూకంపం ప్రభావం కనిపించింది. అధికారులు అప్రమత్తమై ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, వదంతులు వ్యాప్తి చేయవద్దని సూచించారు.
#Earthquake: One of the strongest tremors felt in #Kolkata in recent times.
— Pooja Mehta (@pooja_news) February 27, 2026
People come out of their homes & offices after an earthquake jolts #Kolkata. pic.twitter.com/PChwPZddy6
बंगाल में भूकंप, तीव्रता कम लेकिन दार्जिलिंग में घर से बाहर निकले लोग बंगाल में भूकंप के झटके लगातार जारी हैं. शुक्रवार की सुबह दार्जिलिंग में 2.5 तीव्रता का भूकंप महसूस किया गया. हालांकि भूकंप की तीव्रता अधिक नहीं थी, #Earthquake pic.twitter.com/0tOceq7gqn
— KHUSHI SINGH (@KHUSHISING72967) February 27, 2026
























