iPhone 17 Sales Rush: ఐఫోన్ 17 ఫోన్ల కోసం యాపిల్ సెంటర్ వద్ద పొట్టు పొట్టు కొట్టుకున్న ఐఫోన్ కస్టమర్లు Viral Video
iPhone 17 launch: దేశ వ్యాప్తంగా యాపిల్ స్టోర్ల ముందు కస్టమర్లు ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల కోసం క్యూ కట్టారు. ముంబైలోని బికెసి జియో సెంటర్‌లోని యాపిల్ స్టోర్ వద్ద కస్టమర్లు కొట్టుకున్నారు.

ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబైలలో ఈరోజు iPhone 17 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచే యాపిల్ సెంటర్లకు వినియోగదారులు క్యూ కట్టారు. Apple కంపెనీ ఈసారి iPhone 17, ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro), iPhone 17 Max, మొదటిసారిగా అతిసన్నని మోడల్ iPhone Air లను విడుదల చేసింది. స్టోర్లు తెరుచుకోకముందే యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్లు కనిపించాయి. ఈ క్రమంలో ముంబైలోని బికెసి జియో సెంటర్‌లోని ఆపిల్ స్టోర్ వద్ద కొందరు కస్టమర్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు.
యాపిల్ సెంటర్ ముందు రద్దీ పెరగడం, కొందరు క్యూ పాటించకపోవడంతో తోపులాట .జరిగింది. ఈ క్రమంలో ఐఫోన్ కోసం ఎగబడిన కొందరు పరస్పరం దాడి చేసుకున్నారు. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారంతా పెద్ద సంఖ్యలో యాపిల్ సెంటర్ల వద్ద గుమిగూడారు.
కొందరు కొత్త ఫీచర్లను చెక్ చేయడానికి ఆత్రుతగా ఉంటే, మరికొందరు తమ అలవాటుగా ఐఫోన్ కొత్త మోడల్ ఫోన్ల కోసం సెంటర్లకు తరలివచ్చారు. ఫోన్ డిజైన్, కొత్త A19 బయోనిక్ చిప్ కారణంగా గేమింగ్ అనుభవం గతంలో కంటే మెరుగ్గా ఉంది.
VIDEO | iPhone 17 series launch: A scuffle broke out among a few people amid the rush outside the Apple Store at BKC Jio Centre, Mumbai, prompting security personnel to intervene.
— Press Trust of India (@PTI_News) September 19, 2025
Large crowds had gathered as people waited eagerly for the iPhone 17 pre-booking.#iPhone17… pic.twitter.com/cskTiCB7yi
మెరుగైన గేమింగ్ అనుభవం
ఒక కస్టమర్ అమాన్ మేమన్ మాట్లాడుతూ "నేను iPhone 17 Pro Max సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురుచూశా. ఈసారి, Apple కొత్త డిజైన్‌ను తీసుకొచ్చింది. ఇందులో A19 బయోనిక్ చిప్ ఉంది, ఇది గేమింగ్ అనుభవాన్ని మరింత పెంచుతుంది. నేను గత 6 నెలలుగా దీని కోసం ఎదురు చూస్తున్నాను."
కొత్త iPhone 17 లో ప్రత్యేక ఫీచర్లు
Apple ఈసారి కెమెరా నాణ్యత, ప్రాసెసర్ వేగం.. బ్యాటరీ పనితీరును ప్రత్యేకంగా మెరుగుపరిచింది. iPhone 17లో AI-ఆధారిత ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్, మునుపటి కంటే సన్నగా, తేలికైన డిజైన్ ఉన్నాయని టెక్ నిపుణులు అంటున్నారు.
కొత్త iPhoneలో iPhone Air మోడల్ ఉంది. ఇది ఇప్పటివరకు యాపిల్ నుంచి వచ్చిన అత్యంత సన్నని iPhone. దీని మందం కేవలం 5.6 మిమీ. దీనితో పాటు, Apple Apple Watch సిరీస్ 11, యాపిల్ వాచ్ Ultra 3, Apple Watch SE 3 మరియు AirPods Pro 3 ఇయర్‌బడ్‌లతో పాటు మూడు కొత్త iPhone 17 మోడల్‌లను విడుదల చేసింది.
कौन कहता है हमारे देश में महंगाई और बेरोज़गारी है, देखो iPhone 17 लेने के लिए लोग लाइन में लगे हैं, जो करीब 83 हज़ार का है।
— Virat Sharma 🇮🇳 (@Virat_indian875) September 19, 2025
pic.twitter.com/vz7pBRnMkP
ధర, కొత్త రంగు ఆకర్షించాయి
భారతదేశంలో iPhone 17 ప్రారంభ ధర దాదాపు ₹79,900గా నిర్ణయించారు. అయితే దాని టాప్ వేరియంట్‌ల ధర లక్షకు పైగా ఉంది. దీని నారింజ రంగు వేరియంట్ అత్యంత ప్రజాదరణ పొందుతుందని Apple భావిస్తోంది. సెప్టెంబర్ 12న ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్‌లను దేశవ్యాప్తంగా ఉన్న Apple స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. మొదటి రోజే సోషల్ మీడియాలో #iPhone17 ట్రెండ్ అయ్యింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ తాజా స్మార్ట్‌ఫోన్ కొనేందుకు స్టోర్లకు పరుగులు తీస్తున్నారు.
ఢిల్లీ, ముంబైతో పాటు, ఇతర ప్రధాన నగరాల్లో కూడా ప్రజలు ఇప్పటికే స్టోర్‌ల బయట క్యూలైన్లలో నిల్చున్నారు. Apple కొత్త iPhone 17 సిరీస్ భారతదేశంలో iPhone క్రేజ్ ఇప్పటికీ అంతే బలంగా ఉందని మరోసారి నిరూపించింది.






















