iphone 17 Series Available: నేటి నుంచి ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభం.. ఈ దేశాల్లో భారత్ కంటే తక్కువ ధరకే
iPhone 17 Seies Mobiles | యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్ నేటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా, కెనడాతో సహా కొన్ని దేశాల్లో భారత్ కంటే తక్కువ ధరకే ఈ ఫోన్లు లభిస్తాయి.

Apple కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన iPhone 17 Series విక్రయాలు ఈరోజు (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ సిరీస్‌లో iPhone 17, ఐఫోన్ ఎయిర్ (iPhone Air), iPhone 17 Pro, iphone 17 Pro Maxతో సహా 4 మోడల్స్ ఉన్నాయి. యాపిల్ కంపెనీ వాటిని అనేక అప్‌గ్రేడ్‌లతో విడుదల చేసింది. సెప్టెంబర్ 12 నుంచి ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ కోసం ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. అయితే శుక్రవారం నుండి ఇవి కస్టమర్‌లకు అందనున్నాయి. భారతదేశంతో పోలిస్తే ఏయే దేశాల్లో ఐఫోన్‌లు చౌకగా లభిస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం.
భారతదేశంలో ధర ఎంత?
భారతదేశంలో iPhone 17 సిరీస్ ధర రూ. 82,900 నుంచి ప్రారంభమవుతుంది. iPhone 17లో 256GB వేరియంట్‌ను రూ. 82,900కి కొనుగోలు చేయవచ్చు. iPhone Air ప్రారంభ ధర రూ. 1,19,900, కాగా ఐఫోన్ 17 Pro ప్రారంభ ధర రూ. 1,34,900, ఐఫోన్ 17 Pro Max ధర రూ. 1,49,900గా ఉంది.
ఈ దేశాలలో భారత్ కంటే చౌకగా iPhone 17 మోడల్‌లు
అమెరికా - ఇక్కడ iPhone 17 ప్రారంభ ధర రూ. 66,796 కాగా, iPhone Air ధర రూ. 83,400కి విక్రయిస్తున్నారు. ప్రో మోడల్ కోసం మీరు రూ. 91,900, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మోడల్ కోసం రూ. 99,900 చెల్లించాలి.
దుబాయ్ - ఇక్కడ iPhone 17 రూ. 62,882, Air రూ. 74,800 చెల్లించాలి, ఐఫోన్ 17 Pro రూ. 91,000, ఐఫోన్ 17 Pro Max రూ. 99,800కి లభిస్తుంది. భారతదేశంతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.
కెనడా - కెనడాలో iPhone 17 కొనడానికి రూ. 77,110, ఎయిర్ మోడల్ కోసం రూ. 98,100, ఐఫోన్ 17 ప్రో కోసం రూ. 1,08,300, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కోసం రూ. 1,18,800 ఖర్చు చేయాలి.
ఆస్ట్రేలియా - ఇక్కడ iPhone 17 రూ. 74,287, iPhone Air రూ. 95,600, iPhone 17 Pro రూ. 1,06,100కి కొనుగోలు చేయవచ్చు. iPhone 17 Pro Max కోసం ఇక్కడ రూ. 1,16,200 చెల్లించాలి.
చైనా - చైనాలో ఐఫోన్ 17 సిరీస్ ధర భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉంది. చైనాలో iPhone 17 రూ. 79,786, ఐఫోన్ ఎయిర్ మోడల్ రూ. 1,06,400కి లభిస్తుంది. ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర ఇక్కడ రూ. 1,19,700 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కోసం కస్టమర్ రూ. 1,33,000 చెల్లించాలి.






















