Infinix Zero Flip: మార్కెట్లోకి కొత్త ఫ్లిప్ ఫోన్ ఎంట్రీ - ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ వచ్చేసింది!
Infinix New Phone: ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. అదే ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్. దీని ధర రూ.50 వేల రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది.
Infinix Zero Flip Launched: ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ (Infinix Zero Flip) స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో గురువారం లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇందులో 6.9 అంగుళాల ఇన్నర్ ఫ్లెక్సిబుల్ స్క్రీన్ అందుబాటులో ఉంది. దీని కవర్ డిస్‌ప్లే 3.64 అంగుళాలుగా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. 4720 ఎంఏహెచ్ బ్యాటరీని ఇది సపోర్ట్ చేయనుంది. 70W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌పై ఇది రన్ కానుంది. 512 జీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు. జీరో గ్యాప్ హింజ్, తక్కువ స్క్రీన్ క్రీజ్‌ను ఇది కలిగి ఉంటుందని కంపెనీ అంటోంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ ధర (Infinix Zero Flip Price)
అధికారిక ప్రెస్ రిలీజ్ ప్రకారం ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ ధర 600 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.50,200) నుంచి ప్రారంభం కానుంది. ఫోన్ విక్రయించే దేశాన్ని బట్టి ధరలో కాస్త తేడాలు ఉండవచ్చు. మనదేశంలో మాత్రం ఈ ఫోన్ ఇంకా లాంచ్ కావాల్సి ఉంటుంది. బ్లాసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
ఇన్‌ఫీనిక్స్ జీరో ఫ్లిప్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Infinix Zero Flip Specifications)
ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ప్రధాన స్క్రీన్‌గా అందించారు. 3.64 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌ప్లే కవర్ డిస్‌ప్లేగా ఉంది. ఈ రెండు డిస్‌ప్లేలు 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు రన్ కానున్నాయి. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల యూనిట్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా... అంటే ఇన్నర్ డిస్‌ప్లేలో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు, వెనకవైపు కెమెరాలు మొత్తం 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇందులో ఏఐ వ్లాగ్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా రా ఫుటేజ్‌ను సులభంగా వ్లాగ్‌గా మార్చుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్ధ్యం 4720 ఎంఏహెచ్ కాగా, 70W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఏఐ అసిస్టెంట్, గూగుల్ జెమినీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో జేబీఎల్ ట్యూన్డ్ స్పీకర్లు అందించారు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, ఎన్ఎఫ్‌సీ వాలెట్ వంటి ఫీచర్లు కూడా చూడవచ్చు. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే