అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ వాచ్‌లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అమేజ్‌ఫిట్ వాచ్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. అమేజ్‌ఫిట్ యాక్టివ్ వాచ్ ధర రూ.6,999 కాగా... ఇప్పుడు రూ.4,799కి తగ్గింది. దీనిపై కూపన్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమేజ్ ఫిట్ యాక్టివ్ వాచ్ కూడా రూ.4,799కే అందుబాటులో ఉంది. ఇది ఏకంగా 16 రోజుల బ్యాటరీ లైఫ్ అందించనుంది. ఏఐ హెల్త్ కోచ్ కూడా అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీఈ ధర రూ.8,999 నుంచి రూ.7,649కు తగ్గింది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా దీని ధర మరింత తగ్గనుంది. ఇది 40 గంటల బ్యాటరీ లైఫ్ అందించనుంది. వన్‌ప్లస్ వాచ్ 2ఆర్ ధర రూ.14,999 నుంచి రూ.12,999కు తగ్గింది. ఈ వాచ్ ఏకంగా 100 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను డెలివర్ చేయనుంది.