యూట్యూబ్ తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే యూట్యూబ్ తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను భారీగా పెంచింది. యూట్యూబ్ ప్రీమియం నెలవారీ ప్లాన్ ధర గతంలో రూ.129గా ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్ ధరను రూ.149కి పెంచుతూ యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరిగింది. ఇక యూట్యూబ్ ఫ్యామిలీ నెలవారీ ప్లాన్ ధర భారీగా పెరిగింది. ఒకేసారి రూ.189 నుంచి రూ.299కి ఈ ప్లాన్ ధర పెరగడంతో యూజర్లలో అసహనం పెరిగింది. మూడు నెలల ప్లాన్ ధర రూ.399 నుంచి రూ.459కి పెరిగింది. ఇక వార్షిక ప్లాన్ ధర కూడా చాలా ఎక్కువగా పెరిగింది. రూ.1290 నుంచి రూ.1490కి ఒకేసారి పెంచుతూ యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది.