రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్... పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై రన్ కానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో మనదేశంలో లాంచ్ అయింది.
దీని ధర రూ.21,999 నుంచి ప్రారంభం కానుంది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది.
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్‌మీ యూఐ 5 ఆపరేటింగ సిస్టంపై రియల్‌మీ పీ2 ప్రో 5జీ రన్ కానుంది.
రియల్‌మీ పీ2 ప్రో 5జీలో 80W వైర్డ్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.