ఈ సిరీస్‌లో ప్రతి ఫోన్ స్క్రీన్ వేర్వేరు సైజుల్లో ఉండనుందని తెలుస్తోంది.
అన్నిటి కంటే చిన్నదైన ఐఫోన్ 16లో 6.1 అంగుళాల స్క్రీన్ అందించనున్నట్లు సమాచారం.
ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది.
ఐఫోన్ 16 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్‌ను యాపిల్ అందించనుందట.
టాప్ ఎండ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 6.9 అంగుళాల భారీ స్క్రీన్ ఉంటుందట.
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ల్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే ఓఎల్ఈడీ స్క్రీన్లు ఉండనున్నాయి.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ల్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే ఓఎల్ఈడీ స్క్రీన్లు అందించనున్నారట.
ఐఫోన్ 16, 16 ప్లస్‌ల్లో బ్లాక్, వైట్, గ్రీన్, యెల్లో, పింక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి.
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ల్లో బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, గ్రే టైటానియం, గోల్డ్ టైటానియం కలర్లు ఉండనున్నాయి.