ప్రస్తుతం డిజిటల్ యుగంలో పిల్లలు, యువత ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇప్పటి తరం ఫోన్ లేకుండా కనీసం గంట సేపు కూడా ఉండలేకపోతున్నారు. ఫోన్ లేకపోతే యూత్ సఫొకేషన్ కూడా ఫీల్ అవుతున్నారు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీని వల్ల మీపై మీరు నియంత్రణ కోల్పోతారు. మీరు ఫోన్‌కు అడిక్ట్ అయినట్లే అనుకోవాలి. ఫోన్ ఎక్కువ సేపు వాడితే మీకు కొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కళ్లకి సైట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు కూడా ఫోన్‌కు అడిక్ట్ అయితే కాస్త జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.