ఐకూ జెడ్9 5జీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీనిపై ఇప్పుడు భారీ తగ్గింపు అందించారు. ఇది ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. అమెజాన్‌లో ఈ ఫోన్ ఇప్పుడు రూ.19,999కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ తగ్గింపు లభించనుంది. దీనిపై రూ.17,250 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.