By: ABP Desam | Updated at : 08 Dec 2021 09:43 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 సిరీస్
ఇన్‌ఫినిటీ ఇన్‌బుక్ ఎక్స్1 సిరీస్ మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. ఇందులో రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అవే ఇన్‌బుక్ ఎక్స్1, ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో. ఇన్‌బుక్ ఎక్స్1లో ఇంటెల్ కోర్ ఐ3, కోర్ ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లు ఉండగా.. ఇన్‌బుక్ ఎక్స్1 ప్రోలో ఐ7 వేరియంట్ అందుబాటులో ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్స్ పనిచేయనున్నాయి.
ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్స్ ఎక్స్1, ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో ధర
ఇన్‌బుక్ ఎక్స్1లో ఐ3 వేరియంట్ ధరను రూ.35,999గా నిర్ణయించారు. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఉండనుంది. ఇక 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఉన్న ఐ5 వేరియంట్ ధర రూ.45,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో ధరను రూ.55,999గా నిర్ణయించారు. ఇందులో ఐ7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అందుబాటులో ఉంది.
దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 15వ తేదీ నుంచి జరగనుంది. ఈ ల్యాప్‌టాప్‌లు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యాయి.
ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్పెసిఫికేషన్లు
విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఇందులో ఐ3, ఐ5 ప్రాసెసర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఐ3 ప్రాసెసర్ వేరియంట్‌లో 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ ఎం.2 ఎస్ఎస్‌డీ స్టోరేజ్, ఐ5 వేరియంట్‌లో 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ ఎం.2 ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.
ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌ను ఇందులో అందించారు. ఇందులో 720పీ వెబ్‌క్యాంను కూడా అందించారు. ఇందులో 1.5W స్టీరియో స్పీకర్లు అందించారు. దీంతోపాటు 0.8W ట్వీటర్లు కూడా ఇందులో ఉన్నాయి. డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్, రెండు మైక్రో ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇందులో ఒక యూఎస్‌బీ 2.0, రెండు యూఎస్‌బీ 3.0 పోర్టులు కూడా ఉండనున్నాయి. దీంతోపాటు ఒక హెచ్‌డీఎంఐ 1.4, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. ఇందులో వైఫై, బ్లూటూత్ వీ5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు.
ఇందులో 55Wh బ్యాటరీని అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 1.63 సెంటీమీటర్లు కాగా, బరువు 1.48 గ్రాములుగా ఉంది.
ఇన్‌బుక్ ఎక్స్1 ప్రో స్పెసిఫికేషన్లు
విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ కూడా పని చేయనుంది. ఇందులో కూడా 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేనే అందించారు. ఐ7 ప్రాసెసర్‌పైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది. ఇందులో ఐ7 ప్రాసెసర్‌ను అందించారు. 16 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ ఎం.2 ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
కనెక్టివిటీ ఆప్షన్లు చూడటానికి ఎక్స్1 ప్రో తరహాలోనే ఉన్నాయి. అయితే ప్రో వేరియంట్‌లో మాత్రం వైఫై 6 ఫీచర్‌ను అందించారు. ఇక మిగతా ఫీచర్లన్నీ ఇన్‌బుక్ ఎక్స్1 తరహాలోనే ఉన్నాయి.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్
Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి