అన్వేషించండి

HTC India Entry: అన్న వస్తున్నాడు - ఇండియన్ మార్కెట్లో రీఎంట్రీకి రెడీ అవుతున్న హెచ్‌టీసీ!

HTC New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హెచ్‌టీసీ త్వరలో మనదేశంలో రీ-ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ ఫోన్లు హెచ్‌టీసీ యూ24 సిరీస్ అని తెలుస్తోంది. త్వరలో ఇవి మనదేశంలో లాంచ్ కానున్నాయి.

HTC New Phones Launching in India: ఒకప్పుడు మనదేశంలో హెచ్‌టీసీ స్మార్ట్ ఫోన్లు అంటే దాదాపు యాపిల్ ఐఫోన్లకు ఉండే క్రేజ్ ఉండేది. హెచ్‌టీసీ ఫోన్ చేతిలో ఉందంటే ఒక రిచ్ ఫీలింగ్ ఉండేది. కానీ చైనా బ్రాండ్లు కొట్టిన దెబ్బతో కనుమరుగైన దిగ్గజ బ్రాండ్లలో హెచ్‌టీసీ కూడా ఉంది. 2019లో హెచ్‌టీసీ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది.

రీఎంట్రీకి రెడీ... (HTC India Re Entry)
కానీ ఇప్పుడు హెచ్‌టీసీ తిరిగి మనదేశంలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇండియాలో లాంచ్ చేయడానికి తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను రెడీ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ఏ ఫోన్‌ను లాంచ్ చేయనుంది? ఏ తేదీన లాంచ్ చేయనుందనే విషయాన్ని మాత్రం కంపెనీ సీక్రెట్‌గా ఉంచింది. హెచ్‌టీసీ కమ్‌బ్యాక్‌కు తన గ్లోబల్ సూపర్ హిట్ స్మార్ట్ ఫోన్ అయిన హెచ్‌టీసీ యూ24 సిరీస్‌ను రెడీ చేయనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతేడాది గ్లోబల్ లాంచ్ అయిన హెచ్‌టీసీ యూ23, యూ23 ప్రోలకు తర్వాతి వెర్షన్‌గా యూ24 సిరీస్ లాంచ్ కానుంది.

దీనికి సంబంధించిన టీజర్‌ను హెచ్‌టీసీ అధికారికంగా విడుదల చేసింది. ఇందులో “Allforu” అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా యాడ్ చేసింది. ఇందులో ఉన్న ఇమేజ్‌లో ‘Al24U’ అనే టెక్స్ట్‌ను కూడా చూడవచ్చు. హెచ్‌టీసీ ఈ టీజర్‌లోనే ఫోన్ పేరును టీజ్ చేసి ఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి హెచ్‌టీసీ కొత్త ఫోన్ 2024లోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!

హెచ్‌టీసీ యూ24, హెచ్‌టీసీ యూ24 ప్రో స్మార్ట్ ఫోన్లపై ఇప్పటికే కంపెనీ పని చేయడం ప్రారంభించింది. వీటిలో ఒక హ్యాండ్‌సెట్ అయితే 2QDA100 అనే మోడల్ నంబర్‌తో గీక్‌బెంచ్, బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్లలో కనిపించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పని చేయనున్నట్లు లిస్టింగ్‌ల ప్రకారం తెలుస్తోంది. దీంతోపాటు 12 జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్ వీ5.3 ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ఈ రెండు మోడల్స్‌లో ఫుల్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఐపీ67 సర్టిఫైడ్ బిల్డ్‌తో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను ఇండియన్ మార్కెట్లో హెచ్‌టీసీ కమ్‌బ్యాక్ అని చెప్పవచ్చు. షావోమీ, రెడ్‌మీ, రియల్‌మీ, ఒప్పో, వివో వంటి చైనీస్ బ్రాండ్ల నుంచి విపరీతమైన పోటీ ఎదురవ్వడంతో 2019లో హెచ్‌టీసీ భారతీయ మార్కెట్ నుంచి వెనుదిరిగింది. వీఆర్ ఆధారిత డెవలప్‌మెంట్స్ కోసం వైవ్ అనే ప్రత్యేకమైన డివిజన్ కూడా హెచ్‌టీసీలో అందుబాటులో ఉంది. 

Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget