Honor Magic 6 Pro: ఫ్లాగ్‌షిప్ ఫోన్ హానర్ మ్యాజిక్ ప్రో లాంచ్ - కానీ ఈ రేటుకి కొనేదెవరు?
Honor Magic 6 Pro Price in India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే హానర్ మ్యాజిక్ 6 ప్రో.
Honor Magic 6 Pro Launched: హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.8 అంగుళాల ఎల్టీపీవో డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో 180 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5600 ఎంఏహెచ్ కాగా, వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా ఉంది.
హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ ధర (Honor Magic 6 Pro Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.89,999గా నిర్ణయించారు. బ్లాక్, ఈపీఐ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 15వ తేదీన దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, ఎక్స్‌ప్లోర్‌హానర్.కామ్, మెయిన్ లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు రూ.7,500 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరు నెలల పాటు దీని ధర అస్సలు తగ్గదని కంపెనీ అంటోంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (Honor Magic 6 Pro Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఇందులో ఉంది. 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ ఫోన్ డెలివర్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై హానర్ మ్యాజిక్ 6 ప్రో 5జీ రన్ కానుంది. 12 జీబీ ర్యామ్,512 జీబీ స్టోరేజ్ ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 180 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ హెచ్9000 హెచ్‌డీఆర్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉన్నాయి.
5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5600 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 66W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 40 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్‌గా ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది.
Click stunning pictures with the world’s most advance smartphone! #HONORMagic6Pro5G with AI Falcon Camera, drop-resistance display and an ultra-long battery life. Sale starts 15 August, midnight.
— Explore HONOR (@ExploreHONOR) August 2, 2024
Click here to get notified: https://t.co/VDD11kaS7H#ExploreHONOR pic.twitter.com/3oKCVecneT
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే