అన్వేషించండి

Rinku Singh Replacement: రింకూ సింగ్ జింబాబ్వేతో మ్యాచ్ ఆడకపోతే ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్

India vs zimbabwe super 8 | జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తండ్రికి అనారోగ్యం కారణంగా రింకూ సింగ్ జట్టుకు తాత్కాలికంగా దూరమైన జింబాబ్వేతో మ్యాచ్ అతడు ఆడటం అనుమానమే.

చెన్నై: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా ముందున్న తొలి సవాల్ జింబాబ్వే. ఫిబ్రవరి 26న చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. సూపర్-8లో ఒక ఓటమి తర్వాత భారత్‌కు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ లాంటిదే. దాంతో గురువారం జరగనున్న ఈ మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది.  దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారీ తేడాతో ఓటమి చెందడం జట్టుకు మైనస్ అయింది. 

ఇదే సమయంలో భారత జట్టుకు మరో షాక్ తగిలింది. బ్యాటర్ రింకూ సింగ్  ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా జట్టుకు తాత్కాలికంగా దూరమయ్యాడు. రింకూ తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని, ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. లివర్ ప్రాబ్లమ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు, కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు రింకూ సింగ్ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. దాంతో జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో రింకూ ఆడటం అనుమానమే. అయితే అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారు అనేదానిపై చర్చ జరుగుతోంది. 

ఆప్షన్ నంబర్-1: అక్షర్ పటేల్
ఈ మ్యాచ్‌కు రింకూ సింగ్ అందుబాటులో లేకపోతే, కచ్చితంగా అక్షర్ పటేల్ అతడికి ప్రత్యామ్నాయం కావచ్చు. దాంతో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్ బౌలర్లకు సహకరిస్తుంది. కనుక ఈ పరిస్థితిలో అక్షర్ జట్టుకు అదనపు స్పిన్ ఆప్షన్‌గా మారతాడు. అక్షర్‌ను జట్టులోకి తీసుకుంటే భారత్ నలుగురు ఆల్‌రౌండర్లతో (శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్) బరిలోకి దిగవచ్చు. దీనివల్ల బ్యాటింగ్ డెప్త్ పెరగడమే కాకుండా బౌలింగ్‌లోనూ బ్యాలెన్స్ వస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతల్ని కొనసాగిస్తారు. వారికి పాండ్యా తోడవుతాడు. 

ఆప్షన్ నంబర్-2: సంజూ శాంసన్
రింకూ లేకపోతే రెండవ ప్రత్యామ్నాయం సంజూ శాంసన్. సంజూ దూకుడుగా ఆడే బ్యాటర్. అవసరమైతే ఇన్నింగ్స్ ప్రారంభించగల ప్లేయర్. మిడిల్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయాలనుకుంటే ఈ మ్యాచులో సంజూకు అవకాశం ఇవ్వవచ్చు. దీనివల్ల భారీ షాట్లు ఆడగల అదనపు బ్యాటర్ భారత్‌కు అందుబాటులోకి వస్తాడు.

మ్యాచ్ సూర్య సేనకు కీలకం
భారత్‌కు ఈ మ్యాచ్ కేవలం మరో లీగ్ మ్యాచ్ మాత్రమే కాదు, సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలవాంటే భారీ విజయంతో నెగ్గాలి. నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడానికి భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే బీసీసీఐ మేనేజ్ మెంట్ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుంటుందా, లేక ఆల్ రౌండర్ అక్షర్ ను జట్టులోకి తీసుకుంటుందా ఇప్పుడే చెప్పలేం. కానీ జింబాబ్వేపై సూర్యకుమార్ సేన అద్భుత విజయాన్ని సాధిస్తే ఆశలు సజీవంగా ఉంటాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget