అన్వేషించండి

Shane Warne Tribute: మెల్‌బోర్స్‌తో వార్న్‌కి ఉన్న రిలేషన్ ఏంటీ..? ప్రేక్షకులు, ఆయన పిల్లలు ఎందుకు ఎమోషనల్ అయ్యారు?

Shane Warne Tribute: అంతర్జాతీయ క్రికెట్లో షేన్ వార్న్ 1001 వికెట్లు తీశాడు. ఇక టెస్టుల్లో 708 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 

Melbourne Test Updates: భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మెల్ బోర్న్ స్టేడియంలో గురువారం ఎమోషనల్ వాతావరణం కొంతసేపటివరకు నెలకొంది. దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ కు నివాళీ అర్పించడంతో కాసేపు అక్కడ వెదర్ అంతా ఎమోషనల్ అయింది. ఈ సంఘటన మూడో సెషన్లో చోటు చేసుకుంది. ఆసీస్ కాలామానం ప్రకారం సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు అతని పిల్లలు జాక్సన్, బ్రూక్ వార్న్ తమ హ్యాట్లను తలపై నుంచి కిందికి తీసి, హ్యాట్సాఫ్ ప్రదర్శన చేశారు. దీంతో ఆటగాళ్లు, స్టేడియంలోని 83 వేల మంది పులకించి పోయారు. మార్చి 2022లో చనిపోయిన వార్న్ కు నివాళిగా ప్రతి ఏడాది బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా తొలి రోజు ఇలా చేయడం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారి 2022లో సౌతాఫ్రికా-ఆసీస్ జట్ల మధ్య జరిగినప్పుడు ప్లేయర్లు ఇలా ప్రవర్తించారు. 

350 వార్న్ క్యాప్ నెంబర్..
ఆస్ట్రేలియా తరపు బరిలోకి దిగిన 350వ ఆటగాడు వార్న్ కావడం విశేషం. మరోవైపు ఎంసీజీ ఉన్న విక్టోరియా రాష్ట్రానికి చెందిన వాడే వార్న్ కావడం గమనార్హం. ఇదే మైదానంలో వార్న్ ఎన్నో ఘనతలను సాధించాడు. 56 వికెట్లు తీయడంతోపాటు 1994 యాషెస్ సందర్భంగా అతను హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. సంబరాల్లో భాగంగా టోపీని తలపై నుంచి కిందికి దించే ఐకానిక్ హ్యాట్సాఫ్ ప్రదర్శనను వార్న్ చేశాడు. మరోవైపు అంతర్జాతీయంగా 700వ వికెట్ ను వార్న్ ఇదే మైదానంలో సాధించాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ను ఔట్ చేశాడు. ఈ మైదానంలో ఒక స్టాండుకు వార్న్ పేరు కూడా పెట్టారు. అలాగే మైదానంలో వెలుపల అతని విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. దీంతో గురువారం నాడు మరోసారి లెజెండరీ క్రికెటర్ ను క్రికెట్ ఆస్ట్రేలియా గుర్తు చేసుకుంది. 

ఒక మార్పుతో బరిలోకి దిగిన భారత్..
  ఇక బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న శుబ్మాన్ గిల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ ని జట్టులోకి తీసుకుని కఠిన నిర్ణయం తీసుకుంది.  దీంతో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఒక పేస్ ఆల్ రౌండర్ ఈ బౌలింగ్ కాంబినేషన్ తో భారత్ బరిలోకి దిగింది. గిల్ ను పక్కన పెట్టడంతో భారత బ్యాటింగ్ లైనప్ ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగుతారో ఇంటరెస్టింగ్ గా ఉంది. ఓపెనర్ గా రాణిస్తున్న కేఎల్ రాహుల్ అదే స్థానంలో బరిలోకి దిగినట్లయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్ డౌన్ లో దిగుతాడని తెలుస్తోంది. లేకపోతే రాహుల్ తోపాటు తను ఓపెనర్ గా బరిలోకి దిగి, యశస్వి జైస్వాల్ ను వన్ డౌన్ లో పంపే అవకాశాలను కొట్టి పారేయడానికి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.  మరోవైపు ఆసీస్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్, స్కాట్ బోలాండ్ లను జట్టులోకి తీసుకుంది. తొలి రోజు ఆటముగిసేసరికి ఆసీస్ 311/6 చేసింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. 

Also Read: Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Shruthi Haasan : పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పెళ్లి కంటే రిలేషన్​షిప్​లో ఉండడమే ఇష్టం... పెళ్లిపై మరోసారి శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
SBI Special FD: ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
ఎఫ్‌డీపై ఎక్కువ రాబడి కావాలంటే ఎస్‌బీఐ వైపు చూడండి - స్పెషల్‌ స్కీమ్‌ స్టార్టెడ్‌
Embed widget