News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Temple: దర్శనానంతరం ఆలయంలో కాసేపు కూర్చుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

Sitting In Temple: గుడికి వెళ్లి భ‌గ‌వంతుడిని ద‌ర్శించుకుంటే పుణ్యం ల‌భిస్తుంద‌ని పెద్ద‌లు చెబుతారు. గుడిలో కొంత సేపు కూర్చోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో మీకు తెలుసా?

FOLLOW US: 
Share:

Sitting In Temple: దేవాలయాలను సందర్శించడం, భగవంతుని దర్శనం చేసుకోవడం హిందూ సంప్రదాయంలో పుణ్య కార్యంగా పరిగణిస్తారు. దేవాలయాలను సందర్శించడం వల్ల సానుకూల శక్తి ప్రకంపనలు పెరుగుతాయని, ప్రతి ఒక్కరిలో విశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. అంతే కాదు గుడికి వెళ్లడం వల్ల జీవితంపై నమ్మకం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీనితో పాటు దైవానుగ్రహం కూడా మనపై ఉంది. అందుకే దేవాలయాలను సందర్శించమని పెద్ద‌లు చెబుతారు.

Also Read : ఆత్మలింగంపై వస్త్రాన్ని రావణుడు విసిరేస్తే ఏర్పడిన క్షేత్రం - ప్రపంచంలో రెండో అతిపెద్ద శివుడి విగ్రహం!

కానీ, మనం గుడికి వెళ్లినప్పుడు, దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత కొంతసేపు గుడిలో కూర్చోమని చెబుతారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? గుడిలో కూర్చుంటే ఏం లాభం..?

1. గుడిలో ఎందుకు కూర్చోవాలి?

దేవతా దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలో కొంత సమయం పాటు కూర్చోవడం ఎల్లప్పుడూ మంచిది. దీని వెనుక మ‌న‌కు తెలియ‌ని ఎన్నో అంశాలు ఉన్నాయి.

1. దేవాలయాలు ప్రకృతి నుంచి శక్తిని గ్ర‌హించి, నిల్వ చేసి, ఆలయానికి వ‌చ్చే సందర్శకులకు అందించేలా ప్రత్యేకమైన వాస్తుశిల్పంతో నిర్మిత‌మ‌వుతాయి.

2. పవిత్ర మంత్రాలు, గంట శబ్దాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రతికూల ఆలోచనల నుంచి మనల్ని విముక్తుల‌ను చేస్తాయి.

3. దేవాలయాలలో మనం అనుభవించే ఆధ్యాత్మిక ఆనందం, మన మెదడు కండ‌రాల‌ను మరింత ఉత్తేజపరిచేలా చేస్తుంది, ఫ‌లితంగా మన జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

4. దేవాలయాలలో ధ్యానం చేయడం వల్ల మనకు లభించే శక్తి రెట్టింపు అవుతుంది. అందుకే దర్శనానంతరం ఆలయంలో కాసేపు కూర్చోవాలని పెద్ద‌లు సూచించారు.

2. గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేయాలి?

సాధారణంగా అన్ని దేవాలయాలకు వెళ్లే సమయంలో భక్తులు తమ పాదరక్షలను బయటే వదిలి చెప్పులు లేకుండానే ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ పవిత్రతను కాపాడడమే దీని ఉద్దేశం. అయితే, చెప్పులు లేకుండా పాదాలతో ఆలయంలోకి ప్రవేశించడం వల్ల దేవుని సన్నిధి పవిత్రతను కాపాడటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దేవాలయాలలో అయస్కాంత, విద్యుత్ క్షేత్రాల స్వచ్ఛమైన కంపనాలు ఎక్కువగా ఉంటాయి. ఆలయ గోపుర‌ అంతస్తులు సానుకూల శక్తిని గ్రహించే మంచి కండక్టర్లు. ఈ నేలపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శక్తి మీ శరీరం గుండా వెళుతుంది.

Also Read : దేవాలయాల్లో పుష్క‌రిణి నిర్మాణానికి కార‌ణ‌మేంటి? న‌దుల స‌మీపంలోనే ఆల‌యాలు ఎందుకు?

మనం ఆలయాన్ని సందర్శించడం వల్ల మాత్రమే కాదు. అక్కడ కాసేపు కూర్చోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేవాల‌యంలో కూర్చోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిసింది క‌దా. ఇక నుంచి మీరు దేవాలయాలను సందర్శించినప్పుడు, అక్కడ త‌ప్ప‌కుండా కాసేపు కూర్చోండి. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 12 Aug 2023 07:19 AM (IST) Tags: temple visit sitting in temple positive vibrations mind peace

ఇవి కూడా చూడండి

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

Pitru Paksham 2023:పితృ ప‌క్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జ‌ర‌గ‌బోయే మార్పులేంటో తెలుసా!

Pitru Paksham 2023:పితృ ప‌క్షంలో బిడ్డ పుడితే కుటుంబంలో జ‌ర‌గ‌బోయే మార్పులేంటో తెలుసా!

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌ నైవేద్యాలు చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు!

Batukamma 2023: బ‌తుక‌మ్మ‌ నైవేద్యాలు చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు!

Bathukamma 2023: బతుకమ్మ పండుగలో 9 రోజులు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే!

Bathukamma 2023: బతుకమ్మ పండుగలో 9 రోజులు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలంటే!

Bathukamma 2023: 'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే' - బతుకమ్మలో పేర్చే ఈ పూలవల్ల ఎన్ని ప్రయోజనాలో!

Bathukamma 2023: 'తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే' - బతుకమ్మలో పేర్చే ఈ పూలవల్ల ఎన్ని ప్రయోజనాలో!

టాప్ స్టోరీస్

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం