శనిప్రభావం తగ్గించుకునేందుకు ఇవి దానం చేయండి



శని దేవుడిని ఆరాధించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు ఈ దానాలు ఇవ్వాలని సూచించారు.



ఆవాల నూనె
శనివారం ఆవనూనెను దానం చేయడం చాలా ప్రయోజనకరమ‌ని పరిగణిస్తారు. ఇనుప పాత్రలో ఆవాల నూనె తీసుకుని అందులో 1 రూపాయి నాణెం వేసి పేదలకు దానం చేయండి లేదా పుష్పించే చెట్టుకు సమర్పించండి



నల్ల వ‌స్త్రాలు, బూట్లు
శాస్త్రం ప్రకారం, చాలా కాలంగా అనారోగ్యం మిమ్మల్ని బాధపెడుతుంటే, శనివారం సాయంత్రం ఒక పేద వ్యక్తికి న‌ల్ల‌ని వస్త్రాలు, బూట్లు లేదా చెప్పులు దానం చేయండి. ఇలా చేయడం వల్ల క్రమంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది



ఇనుప పాత్రలు
శనివారం ఇనుప పాత్రలను దానం చేయడం చాలా శుభప్రదమని శాస్త్రాలలో చెప్పారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రయాణం సుఖంగా ఉంటుంది.



నల్ల నువ్వులు
మీరు ఆర్థిక‌ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, శనివారం సాయంత్రం 1.25 కిలోల నల్ల నువ్వులను పేదవారికి దానం చేయండి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు వరుసగా ఐదు శనివారాలు ఇలా చేయాలి.



గుర్రపు నాడా
శుక్రవారం రోజు గుర్రపు నాడాను ఆవాల నూనెలో ముంచి, శనివారం ప్రధాన ద్వారం మీద U ఆకారంలో ఉంచండి. మీ ఇంట్లో ఇలా చేస్తే కుటుంబ సభ్యులు శనిగ్రహ దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందుతారు.



సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest