శ్రావణ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ ముఖ్యమైన రోజులివే
ఆగష్టు 17 శ్రావణ శుద్ధ పాడ్యమి ఈ తిథి నుంచి శుక్ల పక్షం ఆరంభ మవుతుంది.
శ్రావణ శుద్ధ విదియ దీనినే ‘మనోరథ ద్వితీయ’ అంటారు. వాసుదేవుడిని అర్చించి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం, నక్తం, భోజనం చేయాలని చెబుతారు.
శ్రావణ శుద్ధ తదియ ఈరోజు మధు శ్రావణీ వ్రతాన్ని ఆచరించాలని కృత్యసార సముచ్చయము అనే గ్రంథంలో ప్రస్తావించారు
ఆగష్టు 20 శ్రావణ శుద్ధ చవితి శ్రావణశుద్ధ చవితి రోజున రాయలసీమలో నాగులచవితి జరుపుకుంటారు
ఆగష్టు 21 శ్రావణ శుద్ధ పంచమి - గరుడ పంచమి శ్రావణ శుద్ధ పంచమిని కొన్ని వ్రత గ్రంథాలు నాగ పంచమిగా పేర్కొంటున్నాయి.
శ్రావణ శుద్ధ షష్ఠి రోజున శివుడిని పూజిస్తారు శ్రావణ శుద్ధ సప్తమి రోజు ద్వాదశ సప్తమీ వ్రతం ఆచరించాలి ప్రతి నెలలో వచ్చే అష్టమి దుర్గాపూజకు అనుకూలమైనదని పండితులు చెబుతారు.
ఆగష్టు 25 శ్రావణ శుద్ధ నవమి - వరలక్ష్మీ వ్రతం
శ్రావణ శుద్ధ దశమి - ఆశా దశమి శ్రావణ శుద్ధ ఏకాదశి - పుత్ర ఏకాదశి