కొబ్బరి పవిత్రమైన ఫలం. కొబ్బరికాయకు భగవదారాధనకు విడదీయలేని సంబంధం ఉంటుంది. ప్రతి పూజలోనూ కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా సమర్పిస్తారు. శనివారం రోజున 7 కొబ్బరికాయలను నీటితో పాటు అలాగే సమర్పించి ఈ కాయలను పారే నీటిలో లేదా నదిలో వదిలేస్తే శనిదోషం తగ్గుతుంది కొబ్బరికాయతో దిష్టి తీసి పారేనీటిలో వదిలేస్తే దిష్టిపోతుంది. కొబ్బరి కాయను పగుల గొట్టి రెండు కొబ్బరి చిప్పల నిండా చక్కెర నింపి నిర్జన ప్రదేశంలో పాతిపెడితే గ్రహదోషాల నుంచి విముక్తి దొరుకుతుంది వైశాఖ మాసంలో కొబ్బరి చెట్టు పడమరదిక్కున నాటితే ఆర్థిక స్థితి మెరుగవుతుంది. గురువారం నాడు కొబ్బరికాయను గుడ్డలో కట్టి దాన్ని ఇసుకలో ఉంచి తర్వాత విష్ణువు ఆలయంలో ఆ కొబ్బరికాయను సమర్పిస్తే వ్యాపార వృద్ధి ఆర్థిక వృద్ధికి శుక్రవారం లక్ష్మీ పూజలో పెట్టిన కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి ఇంట్లో ఎవరి కంటపడకుండా దాచి పెట్టుకోవాలి.