గరుడపురాణం: మరణించే ముందు మాటెందుకు పడిపోతుంది!



భగవద్గీత ప్రకారం మరణం అనేది ఆత్మ పరివర్తన ప్రక్రియ



ఒక వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆత్మ తన శరీరాన్ని మరణం ద్వారా భర్తీ చేస్తుంది



మరణానికి భయపడనివారు ఎవ్వరూ ఉండరు. కారణం..మరణ సమయంలో అనుభవించే బాధలు



మరణ సమయంలో చాలా మంది మాట కోల్పోతారు, ఏడుస్తారు.. ఇంతకీ మాటెందుకు కోల్పోతారు



గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి మరణ స‌మ‌యం ఆస‌న్న‌మైనప్పుడు ఆ వ్యక్తిలో దివ్య దృష్టి మేల్కొంటుంది. ఒక క్షణంలో ఆ వ్యక్తి కళ్ళ ముందు మొత్తం జీవితం పునరావృతమవుతుంది



మరణ సమయంలో యమ దూతలు వచ్చి ప్రాణాలు తీసుకెళ్లే సమయంలో ఆ వ్యక్తి 100 తేళ్లు కుట్టిన బాధను అనుభవిస్తాడు



నోరంతా పొడిగా మారిపోతుంది..లోపలి నుంచి లాలాజలం బయటకు వస్తుంది. ఆ సమయంలో ఏదో చెప్పాలనే తాపత్రయం ఉన్నా మాట బయటకు రాదు



గరుడ పురాణం ప్రకారం పాపుల జీవిత శక్తి శరీరం దిగువ భాగం నుంచి బ‌య‌ట‌కు వెళుతుంది. భయంకరంగా కనిపించే యమదూతల్ని చూసి మలవిసర్జన చేసుకుంటారట కొందరు



మరణ సమయంలో వ్యక్తి శరీరం నుంచి బొటనవేలు పరిమాణంలో ఒక జీవి బయటపడుతుంది. యమ దూతలు దానిని స్వాధీనం చేసుకుని, బంధించి యమలోకానికి బ‌య‌లుదేర‌తారు. Images Credit: Pinterest