చాణక్య నీతి: ఈ 3 ఆయుధాలు మీ దగ్గరుంటే కష్టాలు రావు



ఒక వ్యక్తి తన చర్యల ఆధారంగా మంచి చెడు పరిణామాలను, ఫలితాలను అనుభవిస్తాడని చెప్పాడు ఆచార్య చాణక్యుడు.



మానవ సంబంధాల గురించి చాలా ముఖ్యమైన విషయాలను తన శిష్యులకు బోధించాడు చాణక్యుడు



కొన్ని ఆలోచనలు మంచి ఫలితాలనిస్తే మరికొన్ని ఆలోచనలు మంచి ఫలితాలను చెడగొడతాయన్నాడు



ముఖ్యంగా ఈ మూడు ఆయుధాలు మీ దగ్గరుంటే సమస్యలు, కష్టాలు అనేవే మీ జీవితంలోకి తొంగి చూడవని వివరించాడు చాణక్యుడు



1. జ్ఞానం
ఆచార్య చాణక్యుడు ప్రకారం, జ్ఞానం అనేది కఠినమైన గోడను ఛేదించి విజయాన్ని సాధించగల సామర్థ్యాన్ని అందించే ఆయుధం



జ్ఞానాన్ని మించిన స్నేహితుడు లేడనే సామెత ఉంది. తెలివైన వ్యక్తి తన పనులన్నింటినీ సులభంగా పూర్తి చేస్తాడు. జ్ఞానం ఉన్న వ్యక్తికి తను చేసేది ఒప్పో, తప్పో తెలుసు



2. విజయం గౌరవానికి సంకేతం
జ్ఞానం ఉన్న వ్యక్తికి తప్పొప్పులు తెలుస్తాయి..ఏ వైపు అడుగేయాలో క్లారిటీ ఉంటుంది. అలాంటప్పుడు విజయం రాకుండా ఎందుకుంటుంది.



విజయం అనేది వ్యక్తి గౌరవానికి ప్రధాన కారణం. అలాంటి గౌరవం మీ జీవితాంతం మీతోనే ఉండాలంటే ముందు జ్ఞానవంతులై ఉండాలి



ధ‌ర్మం
డబ్బు కంటే ధ‌ర్మం గొప్పదని ఆచార్య చాణక్యుడి సిద్ధాంతం. ఎందుకంటే ధ‌ర్మం మనిషిని జీవితంలోనే కాదు, మరణానంతరం కూడా వదిలిపెట్టదు



ఒక వ్యక్తి ధ‌ర్మానికి కట్టుబడి ఉండటమే అతని విజయానికి కారణమని చాణక్యుడు చెప్పాడు. ఎంత పెద్ద కార్యమైనా భక్తిశ్రద్ధలతో చేస్తే అనుకున్న సమయానికి పూర్తవుతుంది.



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest