ఏడాదికి 2 రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడట!



సూర్య గమనం ఆధారంగా కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.



సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ... కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుం



ఏటా జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం, జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం ఉంటుంది.



సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పుకుంటాం కానీ సరిగ్గా గమనిస్తే సూర్యోదయం తూర్పు దిక్కున జరగదు.



కేవలం ఏడాదిలో రెండురోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అవి మార్చి 21 , సెప్టెంబరు 23.



ఆరు నెలలు ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది.



సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయనం' అని అంటారు.



ఈ ఏడాది (2023) జూలై 17 నుంచి దక్షిణాయణం ప్రారంభమవుతోంది. ఉత్తరాయణంలో దైవకార్యాలు నిర్వహిస్తే దక్షిణాయంలో పితృకార్యాలు నిర్వహించాలని, తర్పణాలు విడవాలని చెబుతారు.



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.



Images Credit: Pinterest