చాణక్య నీతి: ఇలాంటోళ్లని మార్చలేం!



న దుర్జనః సాధుదశాముపైతి బహు ప్రకారైరపి శిక్యమాణః
ఆమూలసిక్తం వయసా ఘృతేన న నిమ్బవృక్షో మధురత్వమేతి



దుష్టుడి స్వభావం గురించి ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా వివరించాడు



కొన్ని అలవాట్లు వయసు పెరిగేకొద్దీ మారుతాయి



మరికొన్ని అలవాట్లు జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మారుతాయి



కానీ కొన్ని అలవాట్లు మాత్రం ఎప్పటికీ మారవని శిష్యులకు బోధించాడు ఆచార్య చాణక్యుడు



దుష్టుడిని ఎప్పటికీ సజ్జనుడిగా మార్చలేం. వేపచెట్టు వేళ్లనుంచి పైనున్న చిగుళ్ల వరకూ పాలు, నేతులతో తడిపినా దానికున్న చేదు పోదు.



అంటే ఏం చేసినా వేపకున్న సహజ గుణం మార్చలేం



అలాగే దుష్టుడికి ఎంత బోధపరిచినా , ఎంత చదివించినా, ఎన్ని మంచిమాటలు చెప్పినా చెవికి ఎక్కవు. అది దుష్టుడి సహజ గుణం.



Images Credit: Pinterest