2023 శ్రావణమాసంలో వచ్చే పండుగల డేట్స్ ఇవే!



హిందూ సనానత ధర్మం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో విశిష్ఠత ఉంది. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రవణం అనే పేరొచ్చింది.



శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం చేసేవారికోసం ఈ ఏడాది నాలుగు మంగళవారాలు( ఆగస్టు 22, 29 సెప్టెంబరు 4, 11) మాత్రమే వచ్చాయి. శ్రావణ శుక్రవారం ఆగస్టు 25న వచ్చింది.



రాయలసీమలో నాగులచవితి- ఆగస్టు 20
నాగ పంచమి, గరుడ పంచమి - ఆగస్టు 21



శ్రావణ మంగళగౌరీ వ్రతం - ఆగస్టు 22
దూర్వాష్టమి - ఆగస్టు 24



వరలక్ష్మీ వ్రతం - ఆగస్టు 25
రాఖీ పౌర్ణమి - ఆగస్టు 30



శ్రీ కృష్ణ జన్మాష్టమి - సెప్టెంబర్ 6
గోకులాష్టమి - సెప్టెంబర్ 7



సెప్టెంబరు 14 పోలాల అమావాస్య



శ్రావణమాసం అంటే కేవలం అమ్మవారి పూజలు,నోములు మాత్రమే కాదు పరమేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రావణమాసంలో వచ్చే ప్రతిసోమవారం శివపూజ తప్పనిసరిగా చేయాలంటారు పండితులు.



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest